Nara Lokesh : తూర్పు గోదావరి జిల్లా – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వం రావడం ఖాయమని జోష్యం చెప్పారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శనివారం యువ గళం కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చిత్రాడ వద్ద పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించారు.
Nara Lokesh Comment
మాజీ ఎమ్మెల్యే వర్మ సారథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేష్(Nara Lokesh) కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి నారా లోకేష్ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజా పాలన సాగడం లేదన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ రాక్షస పాలనకు గడ్డు రోజులు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే అధికారం ఉంది కదా అని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు నారా లోకేష్. అన్ని వర్గాల ప్రజలు తనను, తన తండ్రి చంద్రబాబు నాయుడుకు భారీ ఎత్తున ఆదరిస్తున్నారని ఇది వైసీపీ ప్రభుత్వం కూలేందుకు కారణం కాబోతోందన్నారు.
ఆరు నూరైనా సరే తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా కేసులు నమోదు చేయడం అలవాటుగా మారిందన్నారు. తాము వచ్చేంత దాకా ఓపిక పట్టాలన్నారు నారా లోకేష్.
Also Read : Chandra Babu Naidu : జనమే నా బలం బలగం