Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నవంబర్ 27 నుంచి తిరిగి యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్ వేదికగా టీడీపీ వెల్లడించింది. గతంలో ఆగిన చోటు నుంచే తిరిగి ప్రారంభం అవుతుందని పేర్కొంది.
Nara Lokesh Yuva Galam Will Start
కోనసీమ జిల్లాలో లోకేశ్ పాదయాత్ర షెడ్యూల్ రిలీజ్ చేసింది. సోమవారం ఉదయం 10.19 గంటలకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపింది. తొలి రోజు తాటి పాకలో ఈ సందర్బంగా నారా లోకేష్(Nara Lokesh) బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని వెల్లడించింది.
అంతకు ముందు తన తండ్రి , టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుతో పాటు తనను కూడా ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. చంద్రబాబుపై 8 కేసులు నమోదు చేసింది. ఫైబర్ నెట్ , అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కామ్ లో ఇద్దరినీ చేర్చింది.
ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. హైకోర్టు పర్మినెంట్ బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో బాబు బెయిల్ మంజూరు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది.
Also Read : Rahul Gandhi : తెలంగాణ దోపిడీకి చిరునామా