Narayana Guru : ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు
సంఘ సంస్కర్త నారాయణ గురు
Narayana Guru : మన కాలపు సంఘ సంస్కర్త నారాయణ గురు జయంతి ఇవాళ. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అంటూ కులం గోడలు బద్దలు కొట్టిన సంస్కరణ వాది. దళితులు, మహిళల కోసం గుడులు, బడులు కట్టి చదువు తోనే స్వేచ్ఛ, సమానత్వం సిద్దిస్తుందని చాటి చెప్పిన మహనీయుడు నారాయణ గురు.
Narayana Guru Words
ఆగస్టు 20 1856లో పుట్టారు. సెప్టెంబర్ 20, 1928లో కాలం చేశారు. భారత దేశంలో పేరు పొందిన తత్వవేత్త, ఆధ్యాత్మిక నాయకుడు, సంఘ సంస్కర్త. ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సామాజిక మానవత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేశాడు.
కేరళ లోని కుల, వ్యతిరేక సమాజంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఇదిలా ఉండగా నారాయన గురు(Narayana Guru) దేవుడని ప్రచారం జరిగింది. కానీ నిజానికి ఆయన దేవుడు కాదు. ఆయన భారతీయ సంఘ సంస్కర్త. నారాయణ గురు విగ్రహాన్ని దేవుడిగా పరిగణించ లేమని కేరళ హైకోర్టు పేర్కొంది.
ఆయన అందించిన స్పూర్తి ఎల్లప్పటికీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ చదువు కోవాలని కోరుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేశారు.
Also Read : Sri Sri Sri Swaroopananda Swamy : లోక కళ్యాణం కోసం యాగం