Amritpal Singh NASA : అమృత పాల్ సింగ్ పై నాసా కేసు
పంజాబ్ పోలీసుల ముందు లొంగుబాటు
Amritpal Singh NASA : పారి పోయిన బోధకుడు అమృతపాల్ సింగ్ ఆదివారం పంజాబ్ లోని మెగా లో పోలీసుల ముందు లొంగి పోయాడు. గత మార్చి 18న , 28న రెండుసార్లు ఖాకీల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఖలిస్తానీ – పాకిస్తాన్ ఏజెంట్ గా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి అమృత పాల్ సింగ్ పై. ఇవాళ సింగ్ ను అస్సాం లోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
పోలీసులు అరెస్ట్ చేసే కంటే ముందు అమృత పాల్ సింగ్(Amritpal Singh) గురుద్వారా వద్ద జరిగిన ఒక సభలో ప్రసంగించారు. సింగ్ కు 30 ఏళ్లు. అరెస్ట్ ను ధ్రువీకరించారు పోలీసులు. అరెస్ట్ చేసింది వాస్తవం. ఎలాంటి అబద్దపు ప్రచారాలను నమ్మకండి. శాంతి సామరస్యాన్ని కాపాడు కోవాలని పౌరులకు విన్నవించారు. ఎలాంటి నకిలీ వార్తలను షేర్ చేయవద్దని కోరారు పంజాబ్ పోలీసులు.
అమృత పాల్ సింగ్ పై జాతీయ భద్రతా చట్టం (నాసా)(Amritpal Singh NASA) కింద కేసు నమోదు చేశారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తిని నిర్బంధించేందుకు కేంద్రం లేదా రాష్ట్ర సర్కార్ కు ఫుల్ పవర్స్ ఉంటాయి. నిర్బంధం గరిష్ట కాలం 12 నెలల పాటు ఉంటుంది. సమర్పించిన నివేదికలు, డేటా ఆధారంగా కాల వ్యవధిని పొడిగించేందుకు పవర్స్ ఉంటాయి. యూనిఫాం లో గురుద్వారా లోకి తాము ప్రవేశించ లేదని స్పస్టం చేశారు.
Also Read : ఆస్పత్రిలో చేరిన కుమారస్వామి