Nataraja Statue : ఆకట్టుకుంటున్న నటరాజ విగ్రహం
ఢిల్లీలోని జి20 శిఖరాగ్ర సదస్సులో
Nataraja Statue : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆయన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆయనకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత అంటే వల్లమాలిన అభిమానం. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి ఎక్కడికి వెళ్లినా ముందు అక్కడి దేవాలయాలను సందర్శిస్తారు. వాటి చరిత్ర, పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నరేంద్ర మోదీ.
Nataraja Statue Viral
తాజాగా ఇందులో భాగంగా న్యూఢిల్లీలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించి తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించిన నటరాజ విగ్రహాన్ని(Nataraja Statue) ఇక్కడ ఏర్పాటు చేశారు. భారత మండపం వద్ద దీనిని ప్రతిష్టించారు. ఈ విగ్రహం 27 అడుగుల పొడవు, 18 టన్నుల బరువు ఉన్న ఈ విగ్రహం అష్ట ధాతువులతో తయారు చేయించారు.
అత్యంత ఎత్తైన విగ్రహం తమిళనాడు రాష్ట్రంలోని స్వామి మలైకి చెందిన ప్రశ్యాత వాస్తు శిల్పి రాధాకృష్ణన్ స్థపతి , ఆయన బృందం రికార్డు స్థాయిలో 7 నెలల్లోపే చెక్కారు. చోళ సామ్రాజ్య కాలం నుండి రాధాకృష్ణన్ కు చెందిన 34 తరాల వారు విగ్రహాలను తయారు చేస్తూ వస్తున్నారని ప్రధాన మంత్రి మోదీ వెల్లడించారు.
విశ్వ శక్తి, సృజనాత్మకత, శక్తికి ముఖ్యమైన చిహ్నమైన ఈ నటరాజ విగ్రహం జి20 శిఖరాగ్ర సమావేశంలో ఆకర్షణీయంగా మారనుంది.
Also Read : YS Sharmila : బీఆర్ఎస్ లో మహిళలకు రిజర్వేషన్లు ఏవీ