Rahul Gandhi : ద్వేషంతో దేశాన్ని జయించలేం – రాహుల్
ప్రధానమంత్రి మోదీపై షాకింగ్ కామెంట్స్
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ద్వేషంతో దేశాన్ని జయించిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవన్నారు.
ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం రాజస్థాన్ లో కొనసాగుతోంది. ఈ యాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలట్ పాల్గొన్నారు. రాహుల్ వెంట నడిచారు. ఆదివారం నాటికి మధ్య ప్రదేశ్ లో భారత్ జోడో యాత్ర ముగిసింది.
ఇదిలా ఉండగా దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అనే నినాదంతో రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఇది సుదీర్ఘమైన యాత్ర. తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంగర్ 7న స్టార్ట్ అయిన ఈ యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో పూర్తయింది. ప్రస్తుతం రాజస్థాన్ లోని ఝులావర్ లోని ఝుల్రాపటాన్ లోని కాళీ తలై నుంచి ఇవాళ యాత్ర ప్రారంభమైంది.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ యాత్ర సందర్భంగా భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. మరో వైపు చిన్నారుల నుంచి పెద్దల దాకా రాహుల్ కు సంఘీభావం తెలిపారు. 14 కిలోమీటర్ల వరకు సాగుతుంది. 10 గంటలకు బిలిబోర్దాకు చేరుకుంది.
అనంతరం నహర్డి వరకు సాగింది. సాయంత్రం చంద్రభాగ చౌరహాలో కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు ద్వేషంతో దేనిని గెలవలేమని ప్రేమతోనే సాధ్యమన్నారు.
Also Read : అంతా అబద్దం మళ్లీ మాదే అధికారం