Babu Jagjivan Ram : పేద‌ల బాంధ‌వుడు బాబూజీ

జీవిత కాలమంతా బ‌డుగుల కోస‌మే

Babu Jagjivan Ram : ఈ దేశం ఎంద‌రో మ‌హానుభావుల‌కు జ‌న్మ‌నిచ్చింది. స్వాంతంత్ర స‌మ‌ర యోధుడు. సంఘ సంస్క‌ర్త‌. అరుదైన రాజ‌కీయ నాయ‌కుడు. బీహార్ లోని వెనుక‌బ‌డిన వ‌ర్గాల నుంచి వ‌చ్చారు. ఆయ‌న‌ను అంతా బాబూజీగా పిలుచుకుంటారు. 40 ఏళ్ల పాటు మంత్రి ప‌ద‌వులు నిర్వ‌హించారు. అంట‌రాని వారి కోసం ఆక్రోశించాడు. వాళ్ల‌కు కూడా హ‌క్కులు ఉంటాయ‌ని చాటి చెప్పాడు. 1937లో బీహార్ అసెంబ్లీకి ఎన్నిక‌య్యాడు. గ్రామీణ కార్మిక ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టాడు బాబూ జ‌గ్జీవ‌న్ రామ్.

1946లో నెహ్రూ ప్ర‌భుత్వంలో మంత్రిగా చిన్న వ‌య‌స్సులో చేప‌ట్టాడు. తొలి కేబినెట్ కార్మిక మంత్రిగా చ‌రిత్ర సృష్టించాడు. అంతే కాదు భార‌త రాజ్యాంగ ప‌రిష‌త్తు స‌భ్యుడు కూడా. సామాజిక న్యాయం కోసం చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు పాటుప‌డిన బహుజ‌నుల బాంధ‌వుడు. 1971లో ఇండియా – పాకిస్తాన్ తో జ‌రిగిన యుద్దం స‌మ‌యంలో దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ఉన్నారు జ‌గ్జీవ‌న్ రామ్(Babu Jagjivan Ram). ఈ దేశంలో హ‌రిత విప్ల‌వానికి ఆద్యుడు. వ్య‌వ‌సాయాన్ని ఆధునీక‌రించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

బీహార్ లోని చ‌మ‌ర్ కులంలో పుట్ట‌డంతో కులం దాష్టీకాన్ని అనుభ‌వించాడు. షెడ్యూల్డు కులాల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాతినిధ్యం ఉండాల‌ని ప‌ట్టుప‌ట్టాడు. ప్ర‌తిసారీ త‌న గొంతును వినిపించాడు. ఇక బాబూజీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. జూలై 6న ఆయ‌న క‌న్ను మూశారు. నిన్న‌టి త‌ర‌మే కాదు రేప‌టి త‌రానికి కూడా స్పూర్తి దాయ‌కంగా నిలిచారు.

Also Read : Kumara Swamy : క‌ర్ణాట‌క స‌ర్కార్ పై కుమార కన్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!