APSSDC : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది. యువ నాయకుడు సందింటి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే ఆయన విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేశారు.
దీని ద్వారా రైతులకు మెరుగైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరో వైపు అమూల్ కంపెనీతో పాడి రైతులకు మేలు చేకూర్చేలా ఒప్పందం చేసుకున్నారు. అంతే కాకుండా మేలైన, మెరుగైన విత్తనాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు.
ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతమైన ఫలితాలను అందించేలా చేసింది. ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ – ఏపీ స్టేట్ సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC)కు జాతీయ స్థాయిలో స్కోచ్ పురస్కారం దక్కింది.
రైతు సంక్షేమ విభాగంలో ఏపీకి రజత పతకం లభించింది. ఈ మేరకు సంస్థ తరపున మేనేజింగ్ డైరెక్టర్్ శేఖర్ బాబు ఈ అవార్డును ఢిల్లీలో జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో పాల్గొని స్వీకరించారు.
ఇదిలా ఉండగా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ స్థాయిలో 20 లక్షల మంది రైతులకు విత్తనాలు అందజేసింది సంస్థ.
నాణ్యతా విత్తనాలు సకాలంలో అందించడంలో సంస్థ ఐటీ సాంకేతికతను కూడా వినియోగించడం కూడా జాతీయ స్థాయిలో ఈ పురస్కారం అందుకునేలా చేసింది.
Also Read : పంటల నాణ్యత తనిఖీ సులభతరం