National Herald Case : సోనియా..రాహుల్ గాంధీకీ ఈడీ షాక్
యంగ్ ఇండియన్ ఆఫీసుకు తాళం
National Herald Case : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహణకు(National Herald Case) సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారాయంటూ ఈడీ ఆరోపించింది.
ఈ మేరకు సమన్లు జారీ చేసింది. అంతకు ముందు కాంగ్రెస పార్టీ హయాంలో ఈ కేసును కొట్టి వేసింది. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరాక కొట్టేసిన కేసును తిరిగి ఓపెన్ చేసింది.
ఈసారి భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి ఆధారాలతో సహా సోనియా, రాహుల్ గాంధీకి ప్రమేయం ఉందంటూ, కోట్లు చేతులు మారాయంటూ సీబీఐకి ఫిర్యాదు చేశారు.
దీని ఆధారంగా కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. వీటిని బేస్ చేసుకుని ఈడీ రంగంలోకి దిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ కు సమన్లు జారీ చేసింది.
రాహుల్ గాంధీని అయిదు రోజుల పాటు విచారించింది. రోజుకు 12 గంటల చొప్పున 60 గంటలకు పైగా విచారించి ప్రశ్నల వర్షం కురిపించింది.
ఇక కరోనా కారణంగా ఆలస్యంగా విచారణకు హాజరైంది ఏఐసీసీ చీఫ్ 75 ఏళ్ల వయస్సు కలిగిన సోనియా గాంధీ. ఆమెను మూడు రోజుల పాటు విచారించింది.
ఇక సోనియా, రాహుల్ ఇచ్చిన సమాధానాల మేరకు బుధవారం ఈడీ కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది. ఢిల్లీ హెరాల్డ్ హౌజ్ బిల్డింగ్ లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీసుకు సీల్ వేసింది.
తమ నుంచి అనుమతి లేకుండా ఆఫీసు తెరవ కూడదని ఆదేశాలు జారీ చేసింది ఈడీ.
Also Read : రాహుల్ పీఎం కావడం ఖాయం – మఠాధిపతి