NIA Raids Rajasthan : రాజస్థాన్ లో ఎన్ఐఏ దాడులు
పీఎఫ్ఐ స్థావరాలపై సోదాలు
NIA Raids Rajasthan : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం రాజస్థాన్ లో సోదాలు(NIA Raids Rajasthan) చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఐఏ రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని ఏడు ప్రాంతాలలో జల్లెడ పట్టింది. కోటా లోని మూడు చోట్ల, సవాయి మాధోపూర్ , భిల్వారా , బుండి, జైపూర్ లలో కొంత మంది అనుమానితుల , వాణిజ్య ప్రాంగణాలపై ఎన్ఐఏ దాడులు చేసింది.
ఇవాళ జరిపిన సోదాల్లో డిజిటల్ పరికరాలు, ఎయిర్ గన్ , పదునైన ఆయుధాలు, నేరారోపణ పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. పూర్తిగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై గత కొంత కాలంగా దాడులు చేస్తూ వస్తోంది.
ఇప్పటికే దీని మూలాలు ఉన్న ప్రతి చోటా సోదాలు చేపడుతోంది. ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, తదితర ప్రధాన ప్రాంతాలలో సోదాలు చేపట్టింది ఎన్ఐఏ. రాజస్థాన్ లోని(NIA Raids Rajasthan) బరన్ జిల్లాకు చెందిన సిదాక్ సర్రాఫ్ , పీఎఫ్ఐ కోటాకు చెందిన మహ్మద్ ఆసిఫ్ తో పాటు పీఎఫ్ఐ కి చెందిన సభ్యులు, ఇతర సానుభూతిపరులను అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
వీరంతా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించడానికి ఒక వారం ముందు ఫెడరల్ ఏజెన్సీ సెప్టెంబర్ 19న కేసు పెట్టింది. సెప్టెంబర్ 28న పీఎఫ్ఐ, దాని ఎనిమిది అనుబంధ సంస్థలు కఠినమైన చట్ట విరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం కింద నిషేధించింది కేంద్రం.
Also Read : బాల్య వివాహాలపై అస్సాం ఉక్కుపాదం