NCW Akhilesh Yadav : అఖిలేష్ పై మహిళా కమిషన్ సీరియస్
నూపుర్ పై ట్వీట్ చేసినందుకు ఆగ్రహం
NCW Akhilesh Yadav : ప్రవక్త మహ్మద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపిన భారతీయ జనతా పార్టీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
అంతే కాకుండా తనకు రక్షణ కావాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది నూపుర్ శర్మ. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. బేషరతుగా దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు.
అహంకారంతో చేసిన వ్యాఖ్యలు అంటూ కామెంట్ చేశారు. అంతే కాదు ఆమెకు ముప్పు లేదు ఆమె వల్లనే దేశానికి ముప్పు ఏర్పడిందన్నారు. ఈ తరుణంలో సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(NCW Akhilesh Yadav) స్పందించారు.
నూపుర్ శర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ లో. దీనిపై అభ్యంతరం తెలపడంతో జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అఖిలేష్ యాదవ్ నూపుర్ శర్మపై ముఖం మాత్రమే కాదు శరీరం కూడా క్షమాపణలు చెప్పాలని, దేశ సామరస్యానికి భంగం కలిగించినందుకు శిక్షించ బడాలని ట్వీట్ చేశారు.
ఇది కలకలం రేపింది. దీంతో అభ్యంతరకరమైన ట్వీట్ చేసినందుకు అఖిలేష్ యాదవ్(NCW Akhilesh Yadav) పై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది జాతీయ మహిళా కమిషన్ .
ఈ మేరకు చైర్ పర్సన్ రేఖా శర్మ యూపీ పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) డీఎస్ చౌహాన్ కు లేఖ రాశారు. మూడు రోజుల్లోపు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది విమెన్ కమిషన్ .
ఇదిలా నుపుర్ శర్మ ఓ టీవీ చర్చలో ప్రవక్తపై అవమానకరమైన రీతిలో కామెంట్స్ చేశారు.
Also Read : ఎంవిఏ నుంచి వైదొలగనున్న కాంగ్రెస్