Naveen Kumar Jindal : నా కుటుంబం ప్ర‌మాదంలో ఉంది

స‌స్పెండైన బీజేపీ నేత న‌వీన్ జిందాల్

Naveen Kumar Jindal : మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వ్యాఖ్య‌లు చేసినందుకు గాను భార‌తీయ జ‌న‌తా పార్టీ ఢిల్లీ మీడియా ఇన్ చార్జ్ ను ఇప్ప‌టికే పార్టీ స‌స్పెండ్ చేసింది. ఆయ‌న‌తో పాటు నూపుర్ శ‌ర్మ‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఈ త‌రుణంలో దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న 51 ముస్లిం దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇప్ప‌టికే అల్ల‌ర్లు, నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతోంది ఇండియా. కంట్రోల్ చేయ‌లేక నానా తంటాలు ప‌డుతున్నారు పోలీసులు.

ఈ త‌రుణంలో వీరిద్ద‌రిని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వారిని చంపేస్తామంటూ కొంద‌రు మంత ఛాంద‌స‌వాదులు హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు.

ఇప్ప‌టికే నిషిద్ధ అల్ ఖైదా ఆత్మాహుతి దాడుల‌కు పాల్ప‌డ‌తామ‌ని వార్నింగ్ ఇచ్చింది. దీంతో భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచారు.

ఈ త‌రుణంలో కామెంట్స్ కు కార‌ణ‌మ‌య్యార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొని పార్టీ నుంచి బ‌హిష్కృతుడైన న‌వీన్ జిందాల్(Naveen Kumar Jindal) తాజాగా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

త‌న‌కు , కుటుంబానికి ప్రాణ‌హాని ఉంద‌ని వాపోయాడు. ఇస్లామిక్ ఛాంద‌స‌వాదులు దాడికి పాల్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపాడు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో కూడా సోష‌ల్ మీడియా పోస్టుల ద్వారా వెలుగులోకి వ‌చ్చాడు.

త‌న నివాస చిరునామాను కొంద‌రు పోస్ట్ చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు న‌వీన్ జిందాల్(Naveen Kumar Jindal). త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్న స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేశాడు.

ఢిల్లీ పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు ఈ బ‌హిష్కృత నేత‌. ఇదిలా ఉండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం ఆ వ్యాఖ్య‌ల్ని ఖండించింది. అవి వారి వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లుగా స్ప‌ష్టం చేసింది.

Also Read : పుల్వామాలో ల‌ష్క‌ర్ ఉగ్ర‌వాదులు హ‌తం

Leave A Reply

Your Email Id will not be published!