Naveen Reddy Vaishali : పెళ్లి కోసం కిడ్నాప్ తతంగం
మిస్టర్ టీ ఫౌండర్ నవీన్ రడ్డి నిర్వాకం
Naveen Reddy Vaishali : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన డాక్టర్ వైశాలి రెడ్డి కిడ్నాప్ కేసులో రోజుకో ట్విస్టు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఘటన జరిగి ఇన్ని రోజులైనా ఇంత వరకు కిడ్నాప్ నకు పాల్పడిన మిస్టర్ టీ ఫౌండర్ నవీన్ రెడ్డి(Naveen Reddy) ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు పోలీసులు.
ఇదిలా ఉండగా పక్కా ప్లాన్ తోనే వైశాలీని కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి రిమాండు రిపోర్ట్ కూడా సిద్దం చేశారు. 2021లో స్పోర్ట్స్ అకాడమీలో వైశాలీ రెడ్డికి, నవీన్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆమె నెంబర్ తీసుకున్నాడు. ఆ వెంటనే ఫోన్ కాల్స్ , మెస్సేజ్ లు స్టార్ట్ చేశాడు.
పరిచయాన్ని అడ్డం పెట్టుకున్నాడు. ఆపై పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. పేరెంట్స్ ఒప్పుకుంటే ఓకేనని చెప్పింది వైశాలి రెడ్డి. వారి పేరెంట్స్ ను ఒప్పించేందుకు ట్రై చేశాడు నవీన్ రెడ్డి. కానీ వాళ్లు ఇతడితో పెళ్లి చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో మనోడు కసి పెంచుకున్నాడు.
ఓ సంస్థకు ఓనర్ ను, యువ వ్యాపారవేత్తనే కాదంటావా అని కక్ష సాధింపులకు దిగాడు. ఆపై వైశాలి పేరుతో నకిలీ ఇన్ స్టా గ్రామ్ ఖాతా తెరిచాడు. ఇద్దరూ కలిసి దిగినట్లు మార్పింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో వైశాలి(Vaishali Reddy) కోసం ఆమె ఇంటి ముందు స్థలాన్ని కూడా లీజుకు తీసుకున్నాడు నవీన్ రెడ్డి.
తాత్కాలికంగా షెడ్డు వేశాడు. వినాయక చవితిని గ్రాండ్ గా చేశాడు. చివరకు వైశాలీ తనకు దక్కదేమోనని ఏకంగా సినీ ఫక్కీలో కిడ్నాప్ కు పాల్పడ్డాడు. వైశాలి ఫిర్యాదు మేరకు 32 మందిని అదుపులో తీసుకున్నారు. నవీన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. వస్తే కానీ అసలు విషయం తెలియదు.
Also Read : కాంగ్రెస్ లో కోవర్టులదే రాజ్యం