Navjyot Sidhu : రాహుల్ జీ జీతే రహో – సిద్దూ
విశ్వసనీయతకు మారు పేరు
Navjyot Sidhu : పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయతకు మారు పేరు రాహుల్ గాంధీ అంటూ పేర్కొన్నారు. అంతే కాదు ఆయన తనకు మెంటార్ గా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయోక్త, మాజీ క్రికెటర్ , రాజకీయ నాయకుడిగా పేరొందారు నవజ్యోత్ సింగ్ సిద్దూ. ఆయన పీసీసీ చీఫ్ గా కూడా పని చేశారు. కానీ వివాదాస్పదంగా మారడంతో అనుకోకుండా పార్టీ ఆయనను తప్పించింది పదవి నుంచి.
ఒకానొక దశలో సిద్దూ కీలకంగా మారారు రాష్ట్రంలో. ఆ తర్వాత అనూహ్యంగా పార్టీ ఓటమి పాలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిన దెబ్బకు పంజాబ్ లో ప్రధాన పార్టీలన్నీ నామ రూపాలు లేకుండా పోయాయి. ఈ తరుణంలో అనుకోని షాక్ తగిలింది నవజ్యోత్ సింగ్ సిద్దూకు(Navjyot Sidhu).
రోడ్డు ప్రమాదంలో హత్యకు పాల్పడ్డాడనే ఆరోపణలతో సిద్దూకు కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉండగా 10 నెలలకే సిద్దూ విడుదలయ్యాడు. సత్ ప్రవర్తన కారణంగా 2 నెలల కాలం పాటు శిక్ష తగ్గించింది. దీంతో నవ జ్యోత్ సింగ్ సిద్దూ ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రాను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రశంసల వర్షం కురిపించాడు సిద్దూ. అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను , మీడియా, కమ్యూనికేషన్ ఇన్ ఛార్జ్ జైరాం రమేష్ ను కూడా కలుసుకున్నారు సిద్దూ. నన్ను చంపినా , జైలులో పెట్టినా నా నిబద్దత మారదన్నారు సిద్దూ.
Also Read : ఖర్గేను కలిసిన నవజ్యోత్ సిద్దూ