Navjyot Singh Sidhu : పంజాబ్ సీఎం మాన్ కాదు కేజ్రీవాల్
నిప్పులు చెరిగిన నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ
Navjyot Singh Sidhu : పంజాబ్ మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ(Navjyot Singh Sidhu) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను టార్గెట్ చేశారు. తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం పంజాబ్ లో ప్రభుత్వం లేదన్నారు. రాష్ట్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేతుల్లో ఉందన్నారు. ఆయన చేతిలో రిమోట్ కంట్రోల్ పెట్టుకుని ఆడిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ట్విట్టర్ వేదికగా ఇవాళ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ భగవంత్ మాన్ ఒకనాడు పార్లమెంట్ లో ప్రజాస్వామ్యం గురించి ప్రసంగించిన వీడియోను ఈ సందర్భంగా షేర్ చేశారు. ఆనాడు డెమోక్రసీ గురించి మాట్లాడిన సీఎం భగవంత్ మాన్ ఇవాళ తను బొమ్మ మాత్రమేనని గుర్తించారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి, ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చి మోసం చేసిన ఘనత ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు దక్కుతుందన్నారు.
పంజాబ్ మాఫియా నుంచి కమీషన్లు తీసుకుని భద్రతా కవచం ధరించినంత మాత్రాన ప్రజలు చూడరని అనుకుంటే పొరపాటు పడినట్లేనని హెచ్చరించారు నవజ్యోత్ సింగ్ సిద్దూ. ప్రకటనల పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారంటూ ఆప్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, పంజాబ్ రాష్ట్రాన్ని, ప్రజలను తాకట్టు పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు సిద్దూ.
Also Read : David Warner
