Navneet Rana : పోలీస్ చీఫ్ పై నవనీత్ రాణా ఫైర్
రసాయన శాస్త్రవేత్త గొంతు కోసి హత్య చేశారు
Navneet Rana : మరాఠాలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా(Navneet Rana) సంచలన కామెంట్స్ చేశారు. తన నియోజకవర్గ పరిధిలో బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ ప్రవక్తపై చేసిన కామెంట్స్ కు మద్దతు ఇచ్చారనే నెపంతో ఓ రసాయన శాస్త్రవేత్త గొంతు కోసి హత్య చేశారని ఆరోపించారు.
కానీ పోలీస్ బాస్ ఆర్తీ సింగ్ మాత్రం దానిని దోపిడీగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. ఇదే విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు లేఖ రాశానని ఎంపీ నవనీత్ రాణా వెల్లడించారు.
ఈ హత్య ఉదయ్ పూర్ హత్య ఒకేసారి జరిగినట్లు తనకు అనిపిస్తోందంటూ అనుమానం వ్యక్తం చేశారు. 12 రోజుల తర్వాత ఆమె ఈ ఘటనపై క్లారిటీ ఇస్తోందని ఆరోపించారు ఎంపీ.
మొదట దానిని దోపిడీ అని చెప్పిందని, కానీ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా అమరావతి పోలీస్ కమిషనర్ పై కూడా విచారణ జరపాలని నవనీత్ రాణా డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా ఎంపీ ఆరోపణ చేసినట్లు అమరావతి నగరంలో జూన్ 21న పని ముగించుకుని తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉమేష్ కోల్టేపై దాడికి పాల్పడ్డారు.
అత్యంత కిరాతకంగా హత్య చేశారు. రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో ఇలాంటి హత్య జరేందుకు వారం రోజుల ముందు ఈ హత్య జరగడం గమనార్హం.
లేఖ రాయడంతో హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆదేశించారు.
Also Read : రేపే ముహూర్తం బల పరీక్షకు సిద్దం