Nawaz Sharif : పాకిస్తాన్ అడుక్కుంటోంది – షరీఫ్
మాజీ ప్రధాన మంత్రి షాకింగ్ కామెంట్స్ మాజీ ప్రధాన మంత్రి షాకింగ్ కామెంట్స్
Nawaz Sharif : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పాలకుల బాధ్యతా రాహిత్యం వల్ల దేశం అధోగతి పాలైందని ఆవేదన చెందారు. ఓ వైపు దాయాది భారత దేశం అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతోందని కితాబు ఇచ్చారు. చంద్రుడి వద్దకు ఇండియా చేరుకుంటే పాకిస్తాన్ మాత్రం ప్రపంచ దేశాల ముందు మోకరిల్లుతోందన్నారు.
Nawaz Sharif Comments Viral
దేశాన్ని నడపలేక భిక్షం ఎత్తుకుంటోందని ఒక రకంగా చెప్పాలంటే అడుక్కుంటోందని ఆరోపించారు. మాజీ ప్రధాన మంత్రి(Nawaz Sharif ) చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను ఉద్దేశించి పరోక్షంగా ఈ కామెంట్స్ చేశారు.
2017లో సైనిక, న్యాయ వ్యవస్థలు అనుసరించిన ఈ విధానాలే ఇందుకు ప్రధాన కారణమయ్యాయని పేర్కొన్నారు నవాజ్ షరీఫ్. ఇదిలా ఉండగా దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు మాజీ ప్రధాన మంత్రి. తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు. తాను స్వదేశానికి అక్టోబర్ 21న రానున్నట్లు వెల్లడించారు.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గతి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆవేదన చెందారు నవాజ్ షరీఫ్. బుధవారం నవాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం లండన్ లో నివాసం ఉంటున్నారు.
Also Read : New Parliament Comment : నవ శకం ప్రజా దేవాలయం