Mahesh Shinde : శివ‌సేన అంతానికి ఎన్సీపీ కుట్ర – షిండే

రెబ‌ల్ శివ‌సేన ఎమ్మెల్యే షిండే ఆరోప‌ణ

Mahesh Shinde : మ‌హారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. ఇప్ప‌టికే శివ‌సేన చీఫ్ , సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే నాయ‌క‌త్వాన్ని స‌వాల్ చేస్తూ వేరు కుంప‌టి పెట్టారు మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు , మంత్రి ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలో.

ప్ర‌స్తుతం త‌న వ‌ద్ద 50 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలో రెబ‌ల్ ఎమ్మెల్యేల‌లో ఒక‌రైన శివ‌సేన ఎమ్మెల్యే మ‌హేష్ షిండే(Mahesh Shinde) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

శ‌నివారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. శివ‌సేన మ‌హారాష్ట్ర‌లో బ‌లంగా ఉంది. దానిని దెబ్బ కొట్టాల‌ని అంర్గ‌తంగా శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలోని నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్ర‌య‌త్నం చేస్తోందంటూ ఆరోపించారు.

ఈ విష‌యం గురించి తాము ప‌లుమార్లు సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు చెప్పినా ఫ‌లితం లేక పోయింద‌న్నారు. అందు వ‌ల్ల‌నే ఆయ‌న‌కు బుద్ది చెప్పాల‌నే ఉద్దేశంతోనే బ‌య‌ట‌కు వ‌చ్చామ‌ని పేర్కొన్నారు.

తాము ఎవ‌రికీ వ్య‌తిరేకం కాద‌ని ఇంకొక‌రి మ‌ద్ద‌తు త‌మ‌కు అవ‌స‌రం లేద‌న్నారు మ‌హేష్ షిండే. ఎన్సీపీ ప్ర‌త్యేకించి శివ‌సేన ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చింద‌న్నారు.

ఇందులో భాగంగా కేబినెట్ మంత్రి అయిన ఏక్ నాథ్ షిండేను కూడా ఇబ్బందుల‌కు గురి చేశార‌ని మండిప‌డ్డారు. క‌నీసం నిధులు కూడా ఇవ్వ‌కుండా డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ నాట‌కాలు ఆడారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎన్సీపీ చేస్తున్న అన్యాయం గురించి ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తూ వ‌చ్చినా ఫ‌లితం లేక పోయింద‌ని ఆవేద‌న చెందారు షిండే(Mahesh Shinde). అందుకే తామంతా త‌మ శివ‌సేన పార్టీని ర‌క్షించు కునేందుకే సీఎంను వ్య‌తిరేకించాల్సి వ‌చ్చింద‌న్నారు.

Also Read : ఫ‌డ్న‌వీస్ వ‌ల్లే మ‌రాఠా సంక్షోభం – రౌత్

Leave A Reply

Your Email Id will not be published!