NEET PG Counselling : 12 నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్ షురూ
17 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం
NEET PG Counselling : ఈనెల 12 నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 2021-22 అకడమిక్ సెషన్ లో విజయవంతమైన అభ్యర్థులకు సీట్లు కేటాయించేందుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.
అఖిల భారత కోటా కింద కేటాయించిన సీట్లలో ఇతర వెనుకబడిన తరగతులకు 27 శాతం కోటాను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో నీట్ పీజీ , అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు కౌన్సెలింగ్ (NEET PG Counselling )ను కొనసాగించేందుకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఈనెల 7న అనుమతి ఇచ్చింది.
2019 జనవరి లో నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా సాధారణ కేటగిరీలో ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తుంది. నీట్ పీజీ కౌన్సెలింగ్ లో జాప్యాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రెసిడెంట్ వైద్యులు నిరసన తెలిపారు.
ఆందోళనలు చేపట్టారు. దీంతో కేంద్రం దిగి రాక తప్పలేదు. ఈ మేరకు కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి రెసిడెంట్ వైద్యులకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చిన మేరకు నీట్ పీజీ కౌన్సెలింగ్(NEET PG Counselling )కమిటీ ఈనెల 12 నుంచి ప్రారంభిస్తుందని వెల్లడించారు.
మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ఈనెల 17 వరకు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఆల్ ఇండియా కోటా సీట్లలో నీట్ పీజీ, యూజీ కోర్సులలో 27 శాతం ఓబీసీ కోటా చెల్లుబాటు అయ్యేందుకు సమ్మతిస్తున్నట్లు జస్టిస్ ధనుంజయ, జస్టిస్ చంద్రచూడ్ , జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
Also Read : విదేశీ విద్యా నిధి విద్యార్థులకు పెన్నిధి