Sonia Gandhi Nehru : సామాజిక ప్రజాస్వామ్య వాది నెహ్రూ
చాచా నెహ్రూకు సోనియా గాంధీ నివాళి
Sonia Gandhi Nehru : దేశ వ్యాప్తంగా భారత దేశ మొట్ట మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi), ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ దేశం అభివృద్ది కోసం పరితపించిన అరుదైన నాయకుడు నెహ్రూ అంటూ పార్టీ పేర్కొంది.
దేశానికి మొదటి ప్రధానమంత్రి, పండిట్ నెహ్రూ సంక్షేమ రాజ్యాన్ని ఆశించిన సామాజిక ప్రజాస్వామిక వాది అని కొనియాడారు. సోమవారం ఢిల్లీలోని శాంతి వాన్ స్మారకం వద్ద సోనియాతో పాటు ఖర్గే, ఇతర సీనియర్ నాయకులు నివాళులు అర్పించారు. ఆయన ఎన్నో కలలు కన్నారు. వాటిని ఆచరణలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.
జీవిత కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా జాతి కలకాలం గుర్తుంచుకునేలా చిరస్మరణీయమైన పనులు చేసి పెట్టారంటూ ప్రశంసించారు. ప్రాజెక్టుల నిర్మాణం, వివిధ సంస్థల ఏర్పాటు జవహర్ లాల్ నెహ్రూ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలకు ఇవాళ సాక్షిభూతంగా ఉన్నాయని పేర్కొన్నారు ఖర్గే.
ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు నెహ్రూకు నివాళులు అర్పించారు. మా మాజీ ప్రధాని నెహ్రూజీకి నివాళి అర్పిస్తున్నా. మన దేశానికి ఆయన చేసిన సేవలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ దార్శనికతను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం నెహ్రూను కొనియాడారు.
Also Read : డింపుల్ యాదవ్ నామినేషన్