JDU RJD Alliance : క‌త్తుల క‌ర‌చాల‌నం కానుందా ప‌టిష్టం

ఆర్జేడీతో జేడీయూ పొత్తు కొత్త ప్ర‌భుత్వం

JDU RJD Alliance : బీహార్ లో రాజ‌కీయాలు స‌రికొత్త పొత్తుకు మ‌ళ్లీ తెర తీశాయి. నిన్న‌టి దాకా నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కు తెర ప‌డింది.

క‌మ‌లంతో క‌టీఫ్ చెప్పాడు నితీశ్ కుమార్. తాజాగా ప్ర‌తిప‌క్ష పార్టీ ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐఎంల్ క‌లిపి(JDU RJD Alliance) మ‌రో సంకీర్ణ స‌ర్కార్ ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టారు. ఒక‌నాడు నితీశ్ కుమార్ , లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ మిత్రులు.

కానీ రాను రాను బీహార్ రాజ‌కీయాల‌లో ఇద్ద‌రూ శ‌త్రువులుగా మారారు. ఇక రాజ‌కీయాల‌లో శాశ్వ‌త శ‌త్రువులు శాశ్వ‌త మిత్రులు అంటూ ఉండ‌రు. ఇది నేటి రాజ‌కీయాల‌కు క‌రెక్టుగా స‌రిపోతుంది.

తాజాగా నితీశ్ కుమార్ , తేజ‌స్వి యాద‌వ్ తో ఒప్పందం కుదిరింది. త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు నితీశ్ కుమార్. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి రాజీనామా స‌మ‌ర్పించారు. ఇక ఇద్ద‌రి మ‌ధ్య ఒప్పందం కుదిరింది.

సీఎంగా నితీశ్ కుమార్ , డిప్యూటీ సీఎంగా తేజ‌స్వి యాద‌వ్ ఉండేలా అగ్రిమెంట్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. స్పీక‌ర్ కాకుండా ఇత‌ర మంత్రి ప‌ద‌వుల ఎంపిక పూర్తిగా నితీశ్ కుమార్ ఎంపిక చేసేందుకు ఓకే చెప్ప‌టినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రో వైపు నితీశ్ కుమార్ విశ్వ‌స‌నీయ‌మైన వ్య‌క్తి కాదంటూ నిన్న‌టి దాకా స్నేహం చేసిన బీజేపీ ఆరోపించింది. నితీశ్ , తేజ‌స్వితో సంకీర్ణ ప్ర‌భుత్వ ఫార్ములా ఖ‌రారైంది.

తేజ‌స్వి యాద‌వ్ హోం శాఖ మంత్రి ప‌ద‌వి కోరిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ కు మూడు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి. జేడీయూ, ఆర్జేడీ స‌మావేశానికి ఎమ్మెల్యేల రాక మొద‌లైంది.

అంద‌రి ఫోన్లు బ‌య‌టే సిబ్బంది తీసుకున్నారు. నితీష్ కుమార్ త‌న చిర‌కాల మిత్రుడు, శ‌త్రువుగా మారిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తో క‌ల‌వ‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : జేడీయూ..ఆర్జేడీ మ‌ధ్య ఒప్పందం

Leave A Reply

Your Email Id will not be published!