Pragya Thakur : ఇది మన సంస్కృతి కాదు – ప్రగ్యా
బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
Pragya Thakur : భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. న్యూ ఇయర్ పేరుతో సెలబ్రేషన్స్ జరుపు కోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది భారతీయ సంస్కృతి, నాగరికత కాదని స్పష్టం చేశారు. దీని పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ తగలేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇప్పటికే ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క హిందువు కుటుంబం ఆయుధాలు కలిగి ఉండాలని లేక పోతే ఇంట్లో కూరగాయాలు తరిగే కత్తులకు పదును పెట్టాలని పిలుపునిచ్చారు ప్రగ్యా ఠాకూర్. ఇప్పటికే ఆమెపై పలు కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా ప్రగ్యా ఠాకూర్(Pragya Thakur) చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి తప్పు లేదని సంపూర్ణ మద్దతు పలికారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఉమా భారతి. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రగ్యా ఠాకూర్. కొత్త సంవత్సరం సందర్భంగా మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. డిసెంబర్ 31న మద్యం సేవించి డ్యాన్సులు చేసే వారు మరుసటి రోజు మధ్యాహ్నానికి ప్రారంభం అయ్యే రోజు కొత్తదనాన్ని అనుభవించ లేరన్నారు ప్రగ్యా ఠాకూర్. పాశ్చాత్య నాగరికతను అనుకరించడం మన సంస్కృతిలో సాధ్యం కాదన్నారు బీజేపీ ఎంపీ.
ఇదే సమయంలో కర్ణాటక లోని శివమొగ్గలో ద్వేష పూరిత ప్రసంగం చేసినందుకు ప్రగ్యా పై కేసులు నమోదయ్యాయి.
Also Read : కొత్త ఏడాది బాగుండాలి