New Zealand PM : న్యూజిలాండ్ పీఎం మోదీకి ఆహ్వానం

న‌రేంద్ర దాస్ రెండు పుస్త‌కాలు ఆవిష్క‌ర‌ణ

New Zealand PM : త‌మ దేశంలో ప‌ర్య‌టించాల్సిందిగా దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని(PM Modi) ఆహ్వానించారు న్యూజిలాండ్ ప్ర‌ధాన‌మంత్రి జెసిండా ఆర్డెర్న్. ఇరు దేశాల మ‌ధ్య బంధాలు మ‌రింత బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ న్యూజిలాండ్ లో ప‌ర్య‌టించారు.

కాగా మంత్రి ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా ఎస్ జై శంక‌ర్ స‌మక్షంలో న‌రేంద్ర మోదీ పాల‌న విశేషాల‌ను, విజ‌యాల‌ను తెలిపే రెండు పుస్త‌కాల‌ను విశ్వ స‌ద్భావ‌న కార్య‌క్రమంలో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి న్యూజిలాండ్ పీఎం(New Zealand PM) జ‌సిండా ఆర్డెర్న్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

ఎన్ఐడీ ఫౌండేష‌న్ చీఫ్ ప్యాట్ర‌న్ స‌త్నామ్ సింగ్ సంధు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పీఎం జెసిండా ఆర్డెర్న్ ప్ర‌ధాని మోదీని రావాల్సిందిగా కోరారు. గ‌త కొన్నేళ్లుగా భార‌త్, న్యూజిలాండ్ దేశాల మ‌ధ్య సంబంధాలు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. వ్యాపార‌, వాణిజ్య రంగాల‌లో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

రాబోయే కాలంలో వృద్దికి భారీ అవకాశాలు ఉన్నాయ‌ని అన్నారు జెసిండా ఆర్డెర్న్. అస్థిర‌త పెరుగుతున్న ప్ర‌పంచంలో ఇరు దేశాలు శాంతి కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని అన్నారు. తాము యుద్దాన్ని కోరుకోవడం లేదంటూ స్ప‌ష్టం చేశారు. బ‌ల‌మైన ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని క‌లిగి ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

త‌మ దేశంలో ప్ర‌వాస భార‌తీయులు 2,50,000 ల మంది ఉన్నార‌ని అన్నారు పీఎం జెసిండా ఆర్డెర్న్. విభిన్న సంస్కృతుల‌కు ఇరు దేశాలు ప్ర‌తీక‌గా నిలిచాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ఆహ్వానించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు జై శంక‌ర్.

Also Read : మెక్సికోలో కాల్పుల మోత 18 మంది హ‌తం

Leave A Reply

Your Email Id will not be published!