NewsClick Slams : మేం ప్ర‌జాప‌క్షం ఎవ‌రికీ త‌ల‌వంచం

స్ప‌ష్టం చేసిన న్యూస్ క్లిక్ మీడియా సంస్థ

NewsClick Slams : న్యూఢిల్లీ – ప్ర‌ముఖ న్యూస్ పోర్ట‌ల్ న్యూస్ క్లిక్ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. తమ సంస్థకు విదేశీ నిధులు రావ‌డం లేద‌ని పేర్కొంది. గురువారం కీల‌క ప్ర‌క‌ట‌నలో పూర్తి వివ‌రాల‌ను తెలిపింది సంస్థ యాజ‌మాన్యం. న్యూస్ క్లిక్ అనేది స్వ‌తంత్ర వార్తా వెబ్ సైట్ అని పేర్కొంది. త‌మ కంటెంట్ అత్యున్న‌త‌మైన ప్ర‌మాణాల‌తో కూడి ఉంటుంద‌ని తెలిపింది. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

NewsClick Slams Centre Govt

న్యూస్ క్లిక్(NewsClick) ప్ర‌త్య‌క్షంగా లేదా ప‌రోక్షంగా ఎవ‌రి నుంచి వార్త‌ల‌ను తీసుకోదు. తాము పెయిడ్ ఆర్టిక‌ల్స్ ను ప్ర‌చురించ‌మ‌ని వెల్ల‌డించింది. తాము ప్ర‌జా ప‌క్షం వ‌హిస్తామ‌ని ఎవ‌రికీ త‌ల‌వంచే ప్ర‌స‌క్తి లేద‌ని తెలిపింది .

త‌మ న్యూస్ పోర్ట‌ల్ లో చైనాకు సంబంధించి వార్త‌లు కానీ లేదా దాని గురించి ప్ర‌చారం చేయ‌బోద‌ని తెలిపింది. వార్త‌ల‌ను వార్త‌లుగా మాత్ర‌మే తాము ప్ర‌చురిస్తామ‌ని కేంద్రం ఆరోపించిన‌ట్లు తాము మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డ‌లేద‌ని న్యూస్ క్లిక్ స్ప‌ష్టం చేసింది.

న్యూస్ క్లిక్ కు అందిన నిధుల వివ‌రాల‌న్నీ ఆర్బీఐకి తెలియ చేయ‌డం జ‌రిగింద‌ని పేర్కొంది. ఇప్ప‌టి దాకా త‌మ వెబ్ సైట్ ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి నేటి దాకా తాము ప్ర‌చురించిన కంటెంట్ ను చూడ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించింది.

Also Read : Muttaiah Muralitharan : హైద‌రాబాద్ న‌గ‌రం అద్భుతం

Leave A Reply

Your Email Id will not be published!