NIA Dawood Ibrahim : దావూద్ ఇబ్ర‌హీంపై రూ. 25 ల‌క్ష‌ల రివార్డు

ప్ర‌కటించిన జాతీయ ద‌ర్యాప్తు సంస్థ

NIA Dawood Ibrahim : మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న పాకిస్తాన్ కు చెందిన దావూద్ ఇబ్రహీంపై(NIA Dawood Ibrahim) రూ. 25 ల‌క్ష‌ల రివార్డును ప్ర‌కటించింది జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). ఇబ్రహీం ఆచూకి తెలిపినా లేదా ప‌ట్టుకున్నా న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామ‌ని తెలిపింది.

చోటా ష‌కీల్ కు రూ. 20 ల‌క్ష‌లు, అనీస్ , చిక్కా, మెమెన్ ల‌కు ఒక్కొక్క‌రికీ రూ. 15 ల‌క్ష‌లు ప్ర‌క‌టించింది ఎన్ఐఏ. వీరింద‌రికీ క‌లిపి ఓ పేరుంది అదే డి కంపెనీ.

అదే ఇబ్ర‌హీం గ్యాంగ్. భార‌త దేశంలో స్మ‌గ్లింగ్ చేసేందుకు ఒక యూనిట్ ను స్థాపించేందుకు సంబంధించిన విచార‌ణ‌లో ప్ర‌క‌టించింది.

ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు, డ్ర‌గ్స్ , న‌కిలీ భార‌తీయ క‌రెన్సీ నోట్లు , పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో స‌న్నిహితంగా ఉంటూ దాడుల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని ఎన్ఐఏ ఉన్నాధికారులు తెలిపారు.

దావూద్ ఇబ్ర‌హీం(Dawood Ibrahim) సోద‌రుడు అనీస్ ఇబ్ర‌హీం అలియాస్ హాజీ అనీస్ కు రివార్డుల‌ను ప్ర‌క‌టించింది. స‌న్నిహితులైన జావెద్ ప‌టేల్ అలియాస్ జావేద్ చిక్కా, ష‌కీల్ షేక్ అలియాస్ ఛోటా ష‌కీల్ , ఇబ్ర‌హీం ముస్తాన్ అబ్దుల్ ర‌జాక్ మెమన్ అలియాస్ టైగ‌ర్ మెమెన్ ఉన్నారు.

పాకిస్తాన్ లోని క‌రాచీలో ఉండి 1993 ముంబై వ‌రుస పేలుళ్ల‌తో స‌హా భారత దేశంలోని అనేక ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడు ఇబ్ర‌హీం.

ఇప్ప‌టికే 2003లో ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి ప్ర‌క‌టించిన $25 మిలియ‌న్ల బ‌హుమానం ఉంది. మోస్ట్ వాంటెడ్ వ్య‌క్తుల‌లో దావూద్ ఒక‌డు.

ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌ల‌ను టార్గెట్ చేసేందుకు డి కంపెనీ ఉగ్ర‌వాద గ్రూపులు, పాక్ గూఢ‌చారి సంస్థ ఐఎస్ఐ సాయంతో భార‌త్ లో ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింద‌ని ఎన్ఐఏ గుర్తించింది.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఇబ్రహీం, స‌హాయ‌కుల‌పై తాజా కేసు న‌మోదు చేసింది.

Also Read : మోదీకి పాకిస్తాన్ పీఎం థ్యాంక్స్

Leave A Reply

Your Email Id will not be published!