NIA Raids PFI : కొన‌సాగుతున్న దాడులు..అరెస్ట్ లు

దేశ‌ వ్యాప్తంగా ఎన్ఐఏ విస్తృత సోదాలు

NIA Raids PFI : జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే దేశంలో ఉగ్ర‌వాదుల‌ను ఏరి పారేసే ప‌నిలో బిజీగా ఉంది. అంతే కాకుండా ఇటీవ‌ల చాప‌కింద నీరులా దేశాన్ని అస్థిర ప‌రిచేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న కేర‌ళ‌కు చెందిన పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థ కార్య‌ల‌కాలాపై(NIA Raids PFI) పూర్తి నిఘా పెట్టింది.

ఆపై విస్తృతంగా దేశ‌మంత‌టా దాడులు చేప‌ట్టింది. మొద‌టి సారి 11 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల‌లో జ‌ల్లెడ ప‌ట్టింది. ఏకంగా 106 మందిని అదుపులోకి తీసుకుంది. ఇదే స‌మ‌యంలో దాడులు చేయ‌డాన్ని నిర‌సిస్తూ ఆందోళ‌న‌లు చేప‌ట్టారు పీపీఎఫ్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.

కాగా మహారాష్ట్ర లోని పుణెలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. దీంతో కేంద్ర హొం శాఖ సీరియ‌స్ గా స్పందించింది. మంగ‌ళ‌వారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు రెండోసారి దాడుల‌కు దిగాయి. ఇవాళ జ‌రిపిన దాడుల్లో 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ , మ‌ధ్య ప్ర‌దేశ్, ఉత్త‌ర ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, తెలంగాణ , త‌దిత‌ర రాష్ట్రాల‌ను గాలిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా పీఎఫ్ఐ చైర్మ‌న్ ఓఎంఏ స‌లాంతో స‌హా కీల‌క‌మైన వారంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజుల త‌ర్వాత తిరిగి దాడులు చేప‌ట్ట‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఎంపీలో 22 మందిని అరెస్ట్ చేశారు. క‌ర్ణాట‌క పోలీస్ బాస్ అలోక్ కుమార్ ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దాడులు కొన‌సాగుతున్నాయ‌ని ఇంకా క్లారిటీ రాలేద‌న్నారు. ఎంత మందిని అరెస్ట్ చేశామ‌న్న‌ది సాయంత్రం లోగా వివ‌రిస్తామ‌న్నారు.

Also Read : బాల్ ఠాక్రే ఫ్యామిలీకి అసిస్టెంట్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!