NIA Raids Kerala : పీఎఫ్ఐ టార్గెట్ కేర‌ళ‌లో ఎన్ఐఏ దాడులు

టెర్ర‌రిస్ట్ స్థావ‌రాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్

NIA Raids Kerala : దేశ వ్యాప్తంగా ఉగ్ర‌వాదులను జ‌ల్లెడ ప‌డుతోంది. వారిని ప్రోత్స‌హిస్తూ వ‌స్తున్న సంస్థ‌ల‌ను, పార్టీల‌పై ఫోక‌స్ పెట్టింది. ఇప్ప‌టికే దాడులు, సోదాలు నిర్వ‌హించింది. రంగంలోకి దిగింది జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). ఈ మేర‌కు కేర‌ళ‌లో(NIA Raids Kerala) దాడులు మొద‌లు పెట్టింది. రాష్ట్రంలోని 56 ప్రాంతాల‌లో సోదాలు చేప‌ట్టింది.

ఇందులో ప్ర‌ధానంగా పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) టెర్ర‌రిస్టు కేసు న‌మోదు చేసింది. దీనిని ఆధారంగా మ‌రోసారి ఫోక‌స్ పెట్టింది. చెప్పా పెట్ట‌కుండా దాడులకు దిగ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది.

ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు దానికి అనుబంధంగా ఉన్న సంస్థ‌ల‌ను నిషేధం విధించింది. ప్ర‌స్తుతం పీఎఫ్ఐకి చెందిన నాయ‌కులు, సానుభూతిప‌రుల ఇళ్ల‌పై దాడులు చేప‌ట్టింది ఎన్ఐఏ. ఇదిలా ఉండ‌గా టెక్నాల‌జీ సాయంతో దీనినే వేరే రూపంలో కార్య‌క‌లాపాలు జ‌రిగేలా చేసిన‌ట్లు నిఘా వ‌ర్గాలు కేంద్రానికి నివేదించాయి.

దీంతో ఎన్ఐఏ బృందం హుటా హుటిన కేర‌ళ‌లో కొలువు తీరింది. స‌ద‌రు సంస్థ‌కు చెందిన కీల‌క‌మైన వ్య‌క్తులు, బాధ్యులను గుర్తించి ఆరా తీస్తోంది. ఇవాళ తెల్లవారుజామున 4 గంట‌ల నుంచే సోదాలు చేప‌ట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. సోదాల‌లో భాగంగా కేర‌ళ లోని ఎర్నాకులంలో జ‌ల్లెడ ప‌డుతోంది ఎన్ఐఏ. తిరువ‌నంత‌పురంలో కూడా ఆరు చోట్ల ఎర్నాకులంలో ఎనిమిది చోట్ల దాడులు జ‌రుపుతోంది.

తాజాగా మంగ‌ళూరులో పేలుడు సంభ‌వించింది. దీని వెనుక పీఎఫ్ఐ ఉంద‌ని తేలింది. ఇది 2006లో ఏర్పాటైంది. 2009లో ఎస్డీపీ పేరుతో పార్టీని ఏర్పాటు చేసింది. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు ఎగ‌దోస్తోంద‌ని తేల్చింది ఎన్ఐఏ(NIA Raids Kerala).

Also Read : రాహుల్ గాంధీ ప్రోటోకాల్ ఉల్లంఘ‌న

Leave A Reply

Your Email Id will not be published!