NIA Searches : ఆరు రాష్ట్రాలలో ఎన్ఐఏ సోదాలు
ఉగ్రవాద కార్యకలాపాలు 13 మంది అనుమానితులు
NIA Searches : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం దేశంలోని ఆరు రాష్ట్రాలలో సోదాలు(NIA Searches) చేపట్టింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి అనుమానితులను గుర్తించే పనిలో పడింది.
ఇందులో భాగంగా 13 మంది నుంచి నేరారోపణల పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఐపీసీ సెక్షన్లు 153ఏ, 153బి, యుఏ(పి) చట్టంలోని 18, 18బి, 38, 39, 40 సెక్షన్ల కింద ఎన్ఐఏ గత నెల్ జూన్ 25న ఢిల్లీలో ఈ కేసును సుమోటోగా నమోదు చేసింది.
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) కార్యకలాపాలకు సంబంధించిన కేసులో దేశంలోని మధ్య ప్రదేశ్ , గుజరాత్ , బీహార్ , కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రలలోని 13 మంది అనుమానితుల ప్రాంగణాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది.
మహారాష్ట్ర లోని నాందేడ్ , కొల్హా పూర్ లలో ఎన్ఐఏ సోదాలు చేపట్టినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. సోదాల సందర్భంగా దోష పూరిత పత్రాలు, మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
గుజరాత్ లోని భరూచ్, సూరత్, నవ్సారి, అహ్మదాబాద్ జిల్లాల్లో సోదాలు జరిపినట్లు పేర్కొంది. ముగ్గురు వ్యక్తులను ప్రశ్నిస్తున్నట్లు గుజరాత్ ఏటీఎస్ స్పష్టం చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలు బయటకు చెప్పలేని ఏటీఎస్ పేర్కొంది.
ఇక గుజరాత్ తో పాటు మధ్య ప్రదేశ్ లోని భోపాల్ , రైసెన్ జిల్లాల్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉందని ఏజేన్సీ తెలిపింది.
ఇక్కడ కూడా అనుమానితుల నుంచి నేరారోపణ పత్రాలు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
Also Read : ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా సంజయ్ అరోరా