Nicole Aunapu Mann : నాసాలో మొదటి అమెరికన్ మహిళ
చరిత్ర సృష్టించిన నికోల్ ఔనపు మాన్
Nicole Aunapu Mann : నికోల్ ఔనపు మాన్ చరిత్ర సృష్టించారు. 2002లో అంతరిక్షంలోకి వెళ్లిన జాన్ హెరింగ్టన్ తర్వాత నికోల్ ఔనపు మాన్ రెండవ స్థానిక అమెరికన్ గా చరిత్ర సృష్టించనున్నారు.
ఇదిలా ఉండగా నాసా వ్యోమగామి నికోల్ ఔనపు మాన్ కు 45 ఏళ్లు. నాసాకు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ -5 మిషన్ కు కమాండర్ గా ఉండబోతున్నారు. దీంతో అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి స్థానిక అమెరికన్ మహిళ అవుతుంది.
ఈ మిషన్ అక్టోబర్ 4న ప్రారంభం కానుంది. ఇక నికోల్ మౌనపు మాన్ అమెరికా లోని కాలిఫోర్నియాలోని పెటాలుమాలో పుట్టారు. రౌండ్ వ్యాలీ ఇండియన్ ట్రైబ్స్ లోని వైలాకికి చెందిన వారు.
నికోల్ మౌనపు మాన్ (Nicole Aunapu Mann) యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆమె స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం నుండి ఫ్లూయిడ్ మెకానిక్స్ లో స్పెషలైజేషన్ తో అదే విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
నికోల్ ఔనపు మాన్ యుఎస్ మెరైన్ కార్ఫ్స్ లో కల్నల్ గా పని చేశారు. 2013లో వ్యోమగామిగా నాసా ఎంపిక చేసింది.
నికోల్ ఔనపు మాన్ శిక్షణలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర వ్యవస్థలు, స్పేస్ వాక్ లు, రష్యన్ భాషా శిక్షణ, రోబోటిక్స్ , ఫిజియోలాజికల్ శిక్షణ, టి-38 విమాన శిక్షణ, నీరు , నిర్జన మనుగడ విభాగాలలో కీలమైక శిక్షణ పొందారు నికోల్ ఔనపు మాన్. ఆమె అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగి ఉన్నారని కితాబు ఇచ్చింది నాసా.
ఇదిలా ఉండగా అరుదైన ఘనత వహించేందుకు ఆమె సిద్దంగా ఉన్నారు.
Also Read : హలో వద్దు వందేమాతరం వాడాలి