Niranjan Reddy : వనపర్తి – ఇన్నేళ్ల పాలనలో రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నీళ్ల నిరంజన్ రెడ్డి. మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అని ఎద్దేవా చేశారు. ప్రజలు బీఆర్ఎస్ మళ్లీ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
Niranjan Reddy Comments Viral
తాము మరోసారి పవర్ లోకి వస్తామని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చినా ఎందుకని సద్వినియోగం చేసుకోలేక పోయారని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి(Niranjan Reddy). కేవలం దాడులకు దిగబడడం, ఆపై వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్దతి కాదన్నారు.
ఆనాడు అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ది చేయలేనోళ్లు ఇవాళ వస్తే ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. ఎన్ని రకాలుగా మాయ మాటలు చెప్పినా, నీచ రాజకీయాలు చేసినా ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఈసారి మళ్లీ సీఎం గా కేసీఆర్ అవుతారని, మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని జోష్యం చెప్పారు. తన గెలుపును ఏ పార్టీ అడ్డు కోలేదన్నారు. దోపిడీకి చిరునామా, అవినీతి అక్రమాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు.
Also Read : CM KCR : బీఆర్ఎస్ కు ఓటు అభివృద్దికి చోటు