Nirmala Sitharaman : మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త
హెచ్చరించిన నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా ప్రభావితం చేసే వారిని నియంత్రించే ప్రతిపాదనలు ఏవీ చేయడం లేదన్నారు. పెట్టుబడిదారులను దోచేస్తున్న యాప్ లను కట్టడి చేసేందకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ఆర్థికంగా లేని పోని సమాచారాన్ని ఇస్తూ ఇబ్బంది పెడుతున్న వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో ఆర్థిక ప్రభావాన్ని చూపుతున్న కొందరి పట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారిని అనుసరించడం వల్ల ఎక్కువగా నష్టాలు కలుగుతాయని తెలిపారు. వారిలో చాలా మంది నిగూఢమైన ఉద్దేశాలతో లేదా మోసపూరిత పథకాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నిర్మలా సీతారామన్.
ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి(Nirmala Sitharaman) మాట్లాడారు. ఆర్థిక రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడి పెట్టటడం , పొదుపు చేయడంపై మంచి సలహాలు, సూచనలు అందించే ఆర్థికరంగ నిపుణులు ఉన్నారని వారిని ఈ సందర్భంగా తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇదే సమయంలో దీనిని అడ్డం పెట్టుకుని తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ దశలో వాటిని నియంత్రించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదన్నారు.
Also Read : అకాల వర్షం కేసీఆర్ అభయ హస్తం