Nirmala Sitharaman : కామారెడ్డి క‌లెక్ట‌ర్ పై నిర్మ‌లా క‌న్నెర్ర‌

కేంద్రం వాటా తెలియ‌క పోతే ఎలా

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) సీరియ‌స్ అయ్యారు. ఆమె తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కామారెడ్డి క‌లెక్ట‌ర్ జితేష్ పాటిల్ కు చుక్క‌లు చూపించారు.

ఆయ‌న ప‌నితీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీర్కూర్ లో రేష‌న్ షాపు ను త‌నిఖీ చేసేందుకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా రేష‌న్ బియ్యంలో కేంద్ర వాటా ఎంత‌ని క‌లెక్ట‌ర్ ను ప్ర‌శ్నించారు.

త‌న‌కు ఆ విష‌యం తెలియ‌దంటూ స‌మాధానం ఇచ్చారు. నిర్ల‌క్ష్యంగా ఆన్స‌ర్ ఇచ్చిన క‌లెక్ట‌ర్ పై మండిప‌డ్డారు నిర్మ‌లా సీతారామ‌న్. అస‌లు ఏం ప‌ని చేస్తున్నావ్.

జిల్లాకు క‌లెక్ట‌ర్ అయి ఉండి తెలియ‌ద‌ని ఎలా అంటారంటూ ప్ర‌శ్నించారు. తాను ఇలాంటి స‌మాధానం ఒప్పుకోన‌ని పేర్కొన్నారు.

వెంట‌నే నీకు అర‌గంట సేపు మాత్ర‌మే స‌మ‌యం ఇస్తున్నాన‌ని అంత లోపు కేంద్రం వాటా ఎంత ఉంటుంద‌నే దానిపై త‌న‌కు క‌రెక్ట్ ఆన్స‌ర్ చెప్పాల‌ని స్ప‌ష్టం చేశారు నిర్మ‌లా సీతారామ‌న్.

కేంద్ర ప్ర‌భుత్వం పేద‌ల సంక్షేమం కోసం ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా రేష‌న్ బియ్యానికి సంబంధించి కిలోకు రూ. 35 ఖ‌ర్చ‌వుతోంద‌ని , కేంద్రం 30 రూపాయ‌లు ఇందుకు గాను భ‌రిస్తోంద‌ని చెప్పారు.

మ‌రో వైపు రేష‌న్ షాపుపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మో(PM Modi) దీ ఫోటో లేక పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. అస‌లు క‌లెక్ట‌ర్ గా ఏం ప‌ని చేస్తున్నారంటూ నిలదీశారు జితేష్ పాటిల్ ను.

వెంట‌నే పీఎం ఫోటోను పెట్టాల‌ని లేక పోతే తానే వ‌చ్చి క‌డ‌తానంటూ హెచ్చ‌రించారు. దీంతో కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ దెబ్బ‌కు క‌లెక్ట‌ర్ మౌనం వ‌హించ‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : ప్ర‌యోగానికి సిద్ద‌మైన డీఆర్డీఓ మిస్సైల్

Leave A Reply

Your Email Id will not be published!