Nisith Pramanik Attack : కేంద్ర మంత్రి కాన్వాయ్ పై దాడి
పశ్చిమ బెంగాల్ లో ఘటన
Nisith Pramanik Convoy Attack : బీజేపీ టీఎంసీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ బీజేపీ పార్టీ ఆఫీసుకు వెళుతుండగా దాడి(Nisith Pramanik Convoy Attack) జరిగింది. ఈ ఘటన కలకలం రేపింది. ఆయన వెళుతున్న సమయంలో నల్ల జెండాలతో స్థానికులు నిరసన తెలిపారు. కొందరు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో మంత్రికి గాయాలు అయ్యే ప్రమాదం నెలకొనడంతో కారు అద్దం ధ్వంసమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు.
ఈ సందర్భంగా ఎంతకూ కంట్రోల్ కాక పోవడంతో టియర్ గ్యాస్ షెల్స్ ను ఉపయోగించాల్సి వచ్చింది. బెంగాల్ లోని కూచ్ బెహార్ లో చోటు చేసుకుంది. ఈ మొత్తం ఆగ్రహానికి కారణం బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పుల్లో స్థానిక గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ప్రాతానికి కూచ్ బెహార్ ఎంపీగా ఉన్నారు. దీనికి ఆయనే కారణమంటూ స్థానికులు ఆగ్రహంతో ఊగి పోయారు. ఇదే సమయంలో ఎంపీకి వ్యతిరేకంగా టీఎంసీ భారీ ర్యాలీ చేపట్టింది.
కేంద్ర మంత్రిని నిలదీయాలని పిలుపునిచ్చారు సీఎం మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. చివరకు ప్రాణాలతో బయట పడ్డారు మంత్రి నిసిత్ ప్రమాణిక్. దాడుల నుంచి క్షేమంగా బయట పడిన కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అధికార పార్టీ కావాలని తనపై దాడికి ఉసిగొల్పిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉందో ఈ దాడులతో తెలిసి పోయిందన్నారు. రాబోయే రోజుల్లో జనం చీదరించడం ఖాయమన్నారు. తాము పవర్ లోకి వస్తామన్నారు కేంద్ర మంత్రి(Nisith Pramanik).
Also Read : ఆత్మహత్యలపై సీజేఐ ఆందోళన