Nitin Gadkari : మారిన స్వ‌రం మ‌న్మోహ‌న్ అద్భుతం

కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కామెంట్స్

Nitin Gadkari : కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ(Nitin Gadkari)  సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా త‌న వాయిస్ ను అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో పెంచుతూ వ‌స్తున్నారు. ఆయ‌న క‌రుడుగ‌ట్టిన రాష్ట్రీయ స్వయం సేవ‌క్ సంఘ్ కు చెందిన వ్య‌క్తిగా పేర్కొంటారు బీజేపీకి చెందిన నేత‌లు.

తాజాగా ప్ర‌తిపక్ష పార్టీకి చెందిన మాజీ ప్ర‌ధాన మంత్రి , ప్రముఖ ఆర్థిక‌వేత్త‌గా పేరొందిన డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ను ఆకాశానికి ఎత్తేశారు నితిన్ గ‌డ్క‌రీ. ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు కేంద్ర‌మంత్రి.

ఇదిలా ఉండ‌గా మ‌న్మోహ‌న్ సింగ్ దేశ ఆర్థిక‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తీసుకున్న నిర్ణ‌యాలు దేశానికి ర‌క్ష‌ణగా మారాయ‌ని పేర్కొన్నారు. ఆనాటి ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల వ‌ల్లే ఇవాళ దేశం కొంత మేర‌కు ఇబ్బందుల నుంచి, ఆర్థిక క‌ష్టాల నుండి గ‌ట్టెక్కింద‌ని అన్నారు నితిన్ గ‌డ్క‌రీ(Nitin Gadkari).

ఇదే స‌మ‌యంలో యావ‌త్ భార‌త దేశం మ‌న్మోహ‌న్ సింగ్ కు ఎంతో రుణ‌ప‌డి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రో వైపు దేశంలో పేద‌లు, సామాన్యులు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ల‌బ్ది చేకూర్చేందుకు ఉదార‌వాద ఆర్థిక విధానాల‌ను తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నితిన్ గ‌డ్క‌రీ.

ఢిల్లీలో జ‌రిగిన పుర‌స్కారాల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్ర‌సంగించారు. ఈసంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా మ‌న్మోహ‌న్ సింగ్ దేశం కోసం తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌స్తావించ‌డం విశేషం.

కేంద్ర మంత్రి మ‌రో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోని రైతులు, పేదలు, సామాన్యుల కోసం సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Also Read : ఇక మాట‌లుండ‌వు చేతలు మాత్ర‌మే

Leave A Reply

Your Email Id will not be published!