Nitin Gadkari : టోల్ ట్యాక్స్ కు తాను తండ్రి లాంటోడిని
తనను తాను గొప్పగా చెప్పుకున్న గడ్కరీ
Nitin Gadkari : కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితిన్ గడ్కరీ తనను తాను భారతదేశంలో ఫాదర్ ఆఫ్ టోల్ టాక్స్ అని పిలుచుకున్నారు.
నగర పరిధిలోని ఎక్స్ ప్రెస్ వేలపై టోల్ ప్లాజాల ఏర్పాటుపై పార్లమెంట్ లో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో లేవదీసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు నితిన్ గడ్కరీ.
గాడి తప్పిన టోల్ వ్యవస్థను గాడిన పెట్టానని, బీఓటీ మొదటి ప్రాజెక్ట్ థానే అని చెప్పారు. 1990వ దశకంలో తాను రాష్ట్ర మంత్రిగా పని చేసిన సమయంలో మహారాష్ట్రలో మొదటి రహదారిని నిర్మించానని చెప్పారు.
దేశంలోని ఎక్స్ ప్రెస్ వేలపై టోల్ ట్యాక్స్ కు తాను పితామహుడినని సంచలన కామెంట్స్ చేశారు. ఎక్స్ ప్రెస్ వేలపై టోల్ ప్లాజాఆలను ఏర్పాటు చేయడంపై సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి గడ్కరీ వల్ల నష్టం తప్ప లాభం జరగలేదని ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సీనియర్ మంత్రి ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పట్టణ, నగర పరిధుల్లో ఎక్స్ ప్రెస్ వేలపై టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. నగరంలో ప్రయాణించాలంటే స్థానిక ప్రజలు టోల్ చెల్లించాల్సి వస్తుందన్నారు.
యూపీఏ ప్రభుత్వం హయాంలో ఇదే చెల్లింపులపై నిలదీసిన నితిన్ గడ్కరీ ఇప్పుడు ఎందుకు మరిచి పోయారంటూ సభ్యులు నిలదీశారు.
ఈ దేశంలో నేనే టోల్ వ్యవస్థను ప్రారంభించానంటూ గొప్పగా చెప్పారు గడ్కరీ.
Also Read : సోనియా..రాహుల్ కు కోలుకోలేని షాక్