Nitin Gadkari visits : తిరుమలలో నితిన్ గడ్కరీ
స్వాగతం పలికిన టీటీడీ ఈవో
Nitin Gadkari visits : కేంద్ర రవాణా, ఉపరితల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పుణ్య క్షేత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర నిలయం విశ్రాంతి గృహానికి చేరుకున్న నితిన్ గడ్కరీకి ఘన స్వాగతం పలికారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి. తిరుమల కొండపై మరింతగా రహదారులు అభివృద్ది చేసేందుకు సహకరించాలని ఈవో కోరారు కేంద్ర మంత్రిని. ఈ సందర్బంగా నితిన్ గడ్కరీ(Nitin Gadkari) సానుకూలంగా స్పందించారంటూ సంతోషం వ్యక్తం చేశారు ఈవో.
అంతకు ముందు శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం 18వ వార్సికోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఈవో ధర్మా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వ విద్యాలయం అభివృద్ది లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు ఈవో. దేశంలోని అనేక యూనివర్శిటీలు ఉన్నాయని కానీ ఎస్వీ యూనివర్శిటీ మాత్రం ప్రత్యేకమన్నారు. ముదుగానే జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టిన ఘనత ఈ యూనివర్శిటీకే దక్కుతుందని చెప్పారు ఏవీ ధర్మా రెడ్డి.
ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసిన బారతీయ విజ్ఞాన ధర యూట్యూబ్ ఛానల్ ను ఈ సందర్బంగా టీటీటీ ఈవో ఏవీ ధర్మారెడ్డి , జేఈవో సదా భార్గవి ప్రారంభించారు. దీని వల్ల అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.
Also Read : TTD EO : వేద విజ్ఞాన కేంద్రంగా ఎస్వీ యూనివర్శిటీ