Prashant Kishor : నితీశ్ భ్రమల్లో ఉంటూ భయపడుతున్నారు
బీహార్ సీఎంపై ప్రశాంత్ కిషోర్ కామెంట్స్
Prashant Kishor : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఐపాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన గత కొంత కాలంగా జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై పై నిప్పులు చెరిగారు. సీఎం ప్రస్తుతం భ్రమల్లో ఉంటూ భయాందోళనకు గురవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
తాను ఏనాడూ తన అవసరం కోసం నితీశ్ కుమార్ ను కలవలేదన్నారు. పార్టీ చీఫ్ గా తనను కోరిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు పీకే. అయితే భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం తాను పని చేస్తున్నానని నితీశ్ కుమార్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు.
గతంలో జేడీయూను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని తాను ఏనాడూ కోరలేదన్నారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). ఈ ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, అబద్దాలంటూ కొట్టి పారేశారు పీకే. నితీశ్ కుమార్ కు వయస్సు పెరిగి పోతోందని ఈ తరుణంలో ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు.
ఆదివారం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. నితీశ్ కుమార్ ఏదో చెప్పాలని అనుకుంటారు కానీ ఇంకేదో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు పీకే. దీనిని ఇంగ్లషులో బీయింగ్ డెల్యూషన్ అంటారని పేర్కొన్నారు.
ఒకవేళ నేను బీజేపీ కోసం పని చేస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని ఎందుకు అంటానని తిరుగు ప్రశ్నించారు ప్రశాంత్ కిషోర్. తన పొలిటికల్ స్ట్రాటజీని తనపై ప్రయోగించడం మాను కోవాలని సీఎంకు హితవు పలికారు.
Also Read : బీజేపీ కోసం పని చేస్తున్న పీకే – నితీశ్