Nitish Kumar KCR : పీఎం పోస్ట్ పై నితీష్..కేసీఆర్ మౌనం
మీడియా ప్రశ్నలకు ఇబ్బంది పడ్డ సీఎంలు
Nitish Kumar KCR : బీజేపీ ముక్త భారత్ అన్నది తమ ప్రధాన నినాదమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. బీహార్ లో పర్యటించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో పాటు కేసీఆర్(Nitish Kumar KCR) మీడియాలో మాట్లాడారు.
2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అందరినీ కలుస్తానని ప్రయత్నిస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా మీడియా మీ ఇద్దరిలో ప్రధాన మంత్రిగా ఎవరు ఉండ బోతున్నారన్న ప్రశ్నకు నీళ్లు నమిలారు. దీనికి సమాధానం చెప్పకుండా దాట వేశారు నితీశ్ కుమార్. దయచేసి కూర్చోండి అంటూ కేసీఆర్ వేడుకున్నారు.
ఇక వెల్దాం అంటూ చెప్పడం హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకున్న మాటలతో కూడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇద్దరు నేతలు ఒకరినొకరు బైటియే అని ఒకరు అనగా చలియే అంటూ మరొకరు చెప్పడం విస్తు పోయేలా చేసింది. 17 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు బీజేపీతో సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar).
జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.
చాలా సేపు ప్రెస్ మీట్ లో కూర్చున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ గంట సేపు కూర్చుని గుడ్ బై చెప్పాడు. నేను పేరు ప్రపోజ్ చేస్తే జనం స్వీకరిస్తారని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. ఒక రకంగా కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది.
Also Read : కేంద్ర దర్యాప్తు సంస్థలపై కోర్టుకు వెళతా