Nitish Kumar Pitched : 2024 కోసం నితీశ్ కుమార్ ప్లాన్
జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి
Nitish Kumar Pitched : రాబోయే 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రయత్నాలు చేశారని జేడీయూ సీనియర్ లీడర్ కేసీ త్యాగి చెప్పారు. ఇందులో భాగంగానే టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒప్పుకున్నారని తెలిపారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట తాము మద్దతు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంంతరం లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా మమతా బెనర్జీ చేసిన ప్రకటన కలకలం రేపింది. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. బీజేపీకి , కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరో కూటమిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆమెకు మద్దతుగా నిలిచారు సమాజ్ వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తాము కలిసి ఉన్నామని ప్రస్తుతం తమ లక్ష్యం ఒక్కటేనని, అది బీజేపీని ఓడించడమేనని పేర్కొన్నారు.
అన్ని పార్టీల అంతిమ టార్గెట్ ఇదేనని స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక విజయం సాధించిన కొన్ని రోజుల తర్వాత మమతా బెనర్జీ విపక్షాల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. మరో వైపు భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.
Also Read : DK Shiva Kumar Siddaramaiah