Nitish Kumar Amruta Fadnavis : అమృత ఫడ్నవీస్ పై నితీశ్ ఫైర్
గాంధీ..మోదీ పితామహులు కామెంట్స్
Nitish Kumar Amruta Fadnavis : ఈ దేశానికి ఇద్దరే పితామహులు. గత భారతావనికి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ అయితే మరొకరు భావి భారత దేశానికి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ అని సంచలన కామెంట్స్ చేశారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్.
ఈ సందర్భంగా అమృత ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ దేశానికి ప్రధాని మోదీ ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు జనతాదళ్ యునైటెడ్ పార్టీ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ . ఈ ఎనిమిదేళ్ల కాలంలో నోట్లను రద్దు చేశారు.
లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ సంస్థలను గంపగుత్తగా బడా ఆసాములకు కట్టబెట్టారంటూ మండిపడ్డారు. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిప ప్రధానమంత్రి దేశానికి పితామహుడు ఎలా అవుతాడంటూ ప్రశ్నించారు. అమృత ఫడ్నవీస్ పై నిప్పులు(Nitish Kumar Amruta Fadnavis) చెరిగారు. ఆమెను ఎగతాళి చేస్తారు సీఎం.
భారతీయ జనతా పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు భారత దేశ విముక్తి కోసం సాగిన స్వాతంత్ర పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యం లేదన్నారు. ఏనాడూ ఆర్ఎస్ఎస్ సహకరించ లేదంటూ ఆరోపించారు నితీశ్ కుమార్. మరో వైపు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే నిప్పులు చెరిగారు అమృత ఫడ్నవీస్ పై.
మహాత్మా గాంధీని ఎవరితో పోల్చలేమని పేర్కొన్నారు. ఆయన జాతిపిత..మోదీ ఎందుకూ పనికి రారంటూ ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వాళ్లను వేధింపులకు గురి చేస్తున్న సర్కార్ మోదీని గాంధీతో పోల్చిన అమృతపై కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read : ప్రధానితో భూపేష్ బఘేల్ భేటీ