Nitish Kumar Modi : బీజేపీ తీరుపై నితీశ్ కుమార్ ఫైర్
జేడీయూ ఎమ్మెల్యేల చేరికపై ఆగ్రహం
Nitish Kumar Modi : తమతో పెట్టుకుంటే బాగుండదంటూ నిప్పులు చెరిగారు జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్. మణిపూర్ జేడీయూకు చెందిన ఎమ్మెల్యేలు ఏడుగురు ఉన్నారు.
వీరిలో ఐదు మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు. బీజేపీలోకి జంప్ అయ్యారు. మణిపూర్ తిరుగుబాటును ప్రత్యేకంగా ప్రస్తావించారు నితీశ్ కుమార్.
17 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీతో జేడీయూ పొత్తు కుదుర్చుకుంది. కంటిన్యూగా బీహార్ లో పాలన కొనసాగిస్తూ వచ్చింది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్(Nitish Kumar).
పాట్నాలో పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశానికి ముందు బీజేపీ సీఎం నితీశ్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ కార్యాలయాన్ని సందర్శించారు.
శనివారం జేడీయూ, బీజేపీ పార్టీల మాటల యుద్దం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శి కె. మేఘజిత్ సింగ్ ప్రకటన విడుదల చేశారు.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీలో విలీనానికి అంగీకరించడం పట్ల స్పీకర్ సంతోషం వ్యక్తం చేశారు.
తన మాజీ మిత్రపక్షం బీజేపీ నాయకుడు , రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు సీఎం నితీశ్ కుమార్.
బీజేపీని ఓడించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ , మణిపూర్ రెండింటి లోనూ ఆ పార్టీ సీట్లు గెల్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు జేడీయూ చీఫ్ లాలన్ సింగ్ .
2015లో బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన మంత్రి(PM Modi) ఎన్నికల ప్రచారం చేశారని 42 ర్యాలీలు చేసినా 243 స్థానాలకు గాను బీజేపీ 53 స్థానాలు మాత్రమే వచ్చాయంటూ ఎద్దేవా చేశారు.
Also Read : జార్ఖండ్ బీజేపీ ఎంపీలపై కేసు