Tejashwi Yadav : విపక్షాలు కలిస్తే నితీశ్ కాబోయే పీఎం
డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కామెంట్స్
Tejashwi Yadav : బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి మద్దతు గనుక ఇస్తే భవిష్యత్తులో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు ప్రధానమంత్రి అయ్యే చాన్స్ ఉందన్నారు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఒక రకంగా జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కు మరింత బలాన్ని ఇచ్చినట్లయింది. ఇదిలా ఉండగా 17 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో జత కట్టారు.
ఉన్నట్టుండి దానికి గుడ్ బై చెప్పారు. ఆపై ప్రతిపక్షాలతో సై అంటూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ , తదితర పార్టీలతో కలిసి మహా ఘట్ బంధన్ (మహా కూటమి ) పేరుతో కొలువు తీరారు.
మరో వైపు 31 మందితో ఏకంగా కొత్త కేబినెట్ ను విస్తరించారు సీఎం. ఎక్కువ మంత్రి పదవులు ఆర్జేడీకే దక్కాయి. ఆదివారం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్(Tejashwi Yadav).
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢీకొనగలిగే సత్తా ఒక్క నితీశ్ కుమార్ కు మాత్రమే ఉందన్నారు. అలా అని తాను ఇతర పార్టీలను తక్కువ చేయడం లేదని స్పష్టం చేశారు.
సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని, అంతే కాక బీహార్ రాష్ట్రానికి ఆయన ఎనిమిదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఇంతటి అనుభవం నరేంద్ర మోదీకి లేదన్నారు.
ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బీజేపీకి జనంలో ఆదరణ లేదన్నారు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి నితీశ్ ను పీఎం అభ్యర్థిగా ఎంపిక చేస్తే బావుంటుందన్నారు తేజస్వి యాదవ్.
Also Read : స్టీరింగ్ కమిటీకి ఆనంద్ శర్మ రాజీనామా