Basant Soren : ఇక జార్ఖండ్ సీఎం సోద‌రుడి వంతు

వేటు వేసేందుకు గ‌వ‌ర్న‌ర్ రెడీ

Basant Soren :  జార్ఖండ్ లో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. కేంద్రం వ‌ర్సెస్ జేఎంఎం సంకీర్ణ స‌ర్కార్ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతూ వ‌చ్చింది.

ఇదే స‌మ‌యంలో సీఎం ప‌ద‌విలో ఉన్న జేఎంఎం చీఫ్ , సీఎం హేమంత్ సోరేన్ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డారంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసింది.

దీంతో ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయొచ్చా లేదా అంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. హేమంత్ సోరేన్ త‌నంత‌కు తానుగా గ‌నుల లీజు తీసుకున్నారంటూ ఆరోపించ‌డంతో ఈసీ వేటు వేయొచ్చంటూ గ‌వ‌ర్న‌ర్ కు సిఫార‌సు చేసింది.

ఆ వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ ఒక్క క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా అన‌ర్హ‌త వేటు వేశారు. దీంతో ఎమ్మెల్యే ప‌ద‌విని కోల్పోయినా ఆరు నెల‌ల కాలం పాటు జార్ఖండ్ సీఎంగా కొన‌సాగ‌నున్నాయి. ఆ మ‌ధ్య‌న నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ప్లాన్ చేసిందంటూ ఆరోపించారు హేమంత్ సోరేన్. ముందు జాగ్ర‌త్త‌గా జేఎంఎం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌ను గెస్ట్ హౌస్ ల‌కు త‌ర‌లించారు.

అక్క‌డి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని ఛ‌త్త‌స్ గ‌ఢ్ రాజధాని రాయ్ పూర్ లో ఉంచారు. అనంత‌రం సీఎం హేమంత్ సోరేన్ గ‌వ‌ర్న‌ర్ కు ఫోన్ చేశారు. తాను బ‌ల నిరూప‌ణ‌కు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో అసెంబ్లీలో విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు. దీంతో బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. కాగా ఉన్న‌ట్టుండి సీఎం సోద‌రుడు బ‌సంత్ సోరేన్ (Basant Soren) ఎమ్మెల్యే ప‌ద‌వి అన‌ర్హ‌త వేటు వేయాలంటూ బీజేపీ కోరింది.

ఓ మైనింగ్ కంపెనీలో భాగ‌స్వామి అని , ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో పేర్కొన‌లేదంటూ ఆరోపించింది. దీంతో గ‌వ‌ర్న‌ర్ ఈసీకి లేఖ రాశారు. వేటు వేసేందుకు రెడీగా ఉన్నారు.

Also Read : స్మృతీ ఇరానీ ఫ్యామిలీదే ‘సిల్లీ సోల్స్’

Leave A Reply

Your Email Id will not be published!