Bandaru Satyanarayana : బండారుకు బిగ్ షాక్
న్యాయవాదులకు నో పర్మిషన్
Bandaru Satyanarayana : ఆంధ్రప్రదేశ్ – టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను ఏపీ సీఎం జగన్ రెడ్డి, మంత్రి రోజాను దూషించారంటూ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు భారీ బందోబస్తు మధ్య బండారు సత్య నారాయణ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు.
Bandaru Satyanarayana Case
ఇదిలా ఉండగా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా కొలిక్కి రాలేదు. ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బండారు(Bandaru Satyanarayana) తరపు న్యాయవాదులను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు.
లాయర్లకు ఎలాంటి అనుమతి లేదదని స్పష్టం చేశారు. తమకు ఎలాంటి అనుమతి లేదని పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయంటూ తెలిపారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నానా అమ్మనా బూతులు తిట్టారు.
ఆపై వ్యక్తిగత విమర్శలు చేశారు. రోజా బ్లూ ఫిలిం లలో నటించిందని, అవి తన వద్ద ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ రాజకీయం చేయబోయారు. అడ్డంగా బుక్ అయ్యారు. ఆపై ఆమె ఎక్కడెక్కడ పడుకుందో కూడా తాను చెప్పగలనని ప్రకటించాడు. సభ్య సమాజం ఛీ కొట్టేలా ఆయన తన కామెంట్స్ ను సమర్థించుకున్నారు. దీంతో ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. అరెస్ట్ చేయాలని ఆదేశించింది.
Also Read : Congress Shock : మైనంపల్లి చేరిక కాంగ్రెస్ లో సెగ