MK Stalin CBI : త‌మిళ‌నాడులో సీబీఐకి నో ఎంట్రీ

సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం

MK Stalin CBI : డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆయ‌న‌కు ఛాతి నొప్పి రావ‌డంతో ఆస్ప‌త్రిలో చేరారు. ఇదే స‌మ‌యంలో సీఎం స్టాలిన్ త‌ప్ప ఇత‌ర మంత్రుల‌ను ఎవ‌రినీ మంత్రిని ప‌రామ‌ర్శించేందుకు అనుమ‌తించ లేదు ఈడీ. దీనిపై నిప్పులు చెరిగారు సీఎం. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోర్టులో తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఎంకే స్టాలిన్(MK Stalin). త‌మిళ‌నాడులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి ఎంట్రీ లేదంటూ ప్ర‌క‌టించారు. సీబీఐకి జ‌న‌ర‌ల్ క‌న్సెంట్ ను ఉప‌సంహ‌రించు కుంటున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇక నుంచి ఏ కేసునైనా ద‌ర్యాప్తు చేయాలంటే ముందుగా త‌మ అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పారు సీఎం.

ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దో రాష్ట్రం కావ‌డం విశేషం. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా సీబీఐకి నో ఎంట్రీ చెప్పింది. మ‌నీ లాండ‌రింగ్ విష‌యంలో మంత్రి సెంథిల్ బాలాజీని అదుపులోకి తీసుకోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. కేసుకు సంబంధించి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పినా ప‌ట్టించు కోలేద‌ని సీఎం మండిప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీబీఐకి నో ఎంట్రీ బోర్డు త‌గిలించిన రాష్ట్రాల‌లో త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ప‌శ్చిమ బెంగాల్, జార్ఖండ్ , రాజస్థాన్ , కేర‌ళ‌, జార్ఖండ్ , పంజాబ్ , మేఘాల‌య‌, మిజోరం రాష్ట్రాలు ఉన్నాయి.

Also Read : Sanju Samson : శాంస‌న్ ఔదార్యం క్రికెట‌ర్ల‌కు స‌హాయం

 

Leave A Reply

Your Email Id will not be published!