Pakistan PM : పాక్ పీఎం అవినీతిపై ఆధారాలు లేవు
స్పష్టం చేసిన లాహోర్ ప్రత్యేక న్యాయస్థానం
Pakistan PM : మనీలాండరింగ్ కేసుల్లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ , ఆయన కుమారుడు హమ్జా షాబాజ్ లకు ఊరట లభించింది. అవినీతి, అధికార దుర్వినియోగం , లంచం తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించ లేదని లాహూర్ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది.
ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) హంజా, ప్రధాన మంత్రి(Pakistan PM) ని అరెస్ట్ చేయడంలో ద్వేష పూరిత ఉద్దేశాలని కలిగి ఉందని పేర్కొంది కోర్టు. వీరిద్దరూ ఇప్పటికే నేషనల్ అకౌంటబిటిలిటీ బ్యూరో కస్టడీలో ఉన్నప్పుడు ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొంది.
ఇదిలా ఉండగా హంజా, షెహబాజ్ షరీఫ్ ఇద్దరినీ డిసెంబర్ 18, 2020, జనవరి 8, 2021న విచారించారు. ఇదే సమయంలో ఎఫ్ఐఏ ఐదు నెలల పాటు విచారించ లేదు. ఎన్ఏబీ కస్టడీ నుండి విడుదలైన తర్వాత ఏజెన్సీ ముందు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది.
విడుదల తర్వాత వారిని మళ్లీ అరెస్ట్ చేయాలని ప్రాసిక్యూషన్ కోరిందని, ఇది దాని దురుద్దేశాన్ని చూపిస్తుందని పేర్కొంది ప్రత్యేక కోర్టు.
కాగా 16 బిలియన్ల పాకిస్తానీ రూపాయల షుగర్ మిల్లుల కుంభకోణంలో హమ్జా షాబాజ్ , ప్రధాన మంత్రి(Pakistan PM) షెహబాజ్ షరీఫ్ ముందస్తు అరెస్ట్ బెయిల్ ను కోర్టు జూన్ 11 వరకు పొడిగించింది.
ఏన్ఏబీ కేసుల్లో బెయిల్ పొందిన తర్వాత తండ్రీ కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేయాలని ఏజెన్సీ కోరుతున్నట్లు తెలిపింది కోర్టు.
ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడు సులేమాన్ యూకేలో పరారీలో ఉన్నాడు. అతనిపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ ను పడగొట్టి షెహబాజ్ పీఎం కావడంలో కీలకంగా మారాడు.
Also Read : మోదీపై కామెంట్స్ సీఇబి చైర్మన్ రిజైన్