Manish Sisodia : ఎన్ని దాడులు చేసినా ఆధారాలు దొరకవు
నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం సిసోడియా
Manish Sisodia : ఢిల్లీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎక్సైజ్ పాలసీ దెబ్బకు ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రం మధ్య మాటల యుద్దానికి దారి తీసీంది. ఇప్పటికే దాడులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది.
15 మందిపై అభియోగాలు మోపింది. ఇందులో ప్రధాన వ్యక్తిగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను చేర్చింది. ఇదిలా ఉండగా ఈ కేసులో కీలకమైన ఆఫీసర్ ఇటీవలే ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు.
దీనికి కారణం కేంద్రం నుంచి వత్తిళ్లేనని ఆరోపించారు సిసోడియా. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా దేశ వ్యాప్తంగా పలు చోట్ల సీబీఐ దాడులు చేపట్టింది.
దీనిపై స్పందించారు డిప్యూటీ సీఎం. ఎన్ని దాడులు చేసినా మద్యం పాలసీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించవన్నారు సిసోడియా.
కేంద్రం పదే పదే తన పరపతిని ఉపయోగించి కేసులు నమోదు చేస్తూ , అరెస్ట్ లతో భయాందోళనకు గురి చేయాలని చూస్తోంది. కానీ వారి ఆటలు సాగవు. మేం ఎక్కడా తప్పు చేయలేదన్నారు సిసోడియా(Manish Sisodia).
ఒకవేళ తాము గనుక తప్పులు చేసి ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న వాళ్లు ఎలా సంతకాలు చేస్తారంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా ప్రస్తుత ఎల్జీగా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాపై సంచలన ఆరోపణలు చేసింది ఆప్.
నోట్ల రద్దు సమయంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని, కేసు కూడా నడుస్తోందని పేర్కొంది. అంతే కాకుండా ముంబైలో అక్రమంగా తన కూతురికి టెండర్ లో ఇంటీరియర్ కాంట్రాక్టు దక్కేలా చేశారంటూ ఆరోపించింది.
మొత్తంగా సిసోడియా అరెస్ట్ అవుతారా లేక ఏం చేస్తారనేది వేచి చూడాలి.
Also Read : సహకార విధాన ముసాయిదా కోసం ప్యానల్