Jagga Reddy : రాహుల్ యాత్ర‌కు పైస‌ల్లేవు – జ‌గ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే సంచ‌ల‌న కామెంట్స్

Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర తెలంగాణ‌లో కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. యాత్రకు ఏర్పాట్లు చేయాలంటే నాతో డ‌బ్బులు లేవు. పార్టీకి సంబంధించి కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్బంగా జ‌గ్గారెడ్డి ప్ర‌సంగించారు. రాహుల్ యాత్ర స‌క్సెస్ చేయాల‌ని ఉంది. కానీ నా వ‌ద్ద డ‌బ్బులు లేవు. పోనీ అప్పులు చేద్దామంటే ఎవ‌రూ ఇచ్చేందుకు ముందుకు రావ‌డం లేద‌న్నారు. రాహుల్ గాంధీకి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికాల‌ని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా గురువారం సంగారెడ్డికి చేరుకోనుంది భార‌త్ జోడో యాత్ర‌.

దీనిని పుర‌స్క‌రించుకుని ఏర్పాట్లపై ప్ర‌త్యేక మీటింగ్ చేప‌ట్టారు ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి(Jagga Reddy). యాత్ర స‌క్సెస్ కావాలంటే డ‌బ్బులు కావాలె. కానీ నా వ‌ద్ద అంత డ‌బ్బు లేదు. పోనీ ఎవ‌రినైనా అప్పు కోసం అడుగుదామంటే ఒక్క‌రు కూడా న‌మ్ముత‌లేరు. డబ్బులు ఇస్త‌లేరంటూ వాపోయారు.

అయినా ఎలాగైనా స‌రే రాహుల్ గాంధీ క‌ష్ట‌ప‌డి మ‌న వ‌ద్ద‌కు వ‌స్తున్న‌డు. అష్ట‌క‌ష్టాలు ప‌డైనా స‌రే జోడో యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు జ‌గ్గారెడ్డి. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. అయ్యో..జ‌గ్గ‌న్న వ‌ద్ద డ‌బ్బులు లేక పోతే ఎట్లా అని జ‌నం గుస‌గుస లాడడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

విచిత్రం ఏమిటంటే జ‌గ్గారెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. విప‌రీత‌మైన స‌ర్కిల్ కూడా ఉంది. ఎన్నో స‌భ‌లు , స‌మావేశాలు చేప‌ట్టిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌కు ఉంది. కానీ ఉన్న‌ట్టుండి అప్పుఉ పుట్ట‌క పోవ‌డం అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందిద‌.

Also Read : తాల్ సే తాల్ మిలా రాహుల్ గాంధీ ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!