Komatireddy Venkat Reddy Telangana : ఏ పార్టీకి 60 సీట్లు మించి రావు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
Komatireddy Venkat Reddy Telangana : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదన్నారు. హంగ్ ఏర్పడడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ కు తమ పార్టీతో కలవక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.కాంగ్రెస్ తో కేసీఆర్ కలిస్తేనే నిలబడతాడని లేకుంటే ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారం కాక తప్పదని జోష్యం చెప్పారు.
మంగళవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒంటరిగా ఏ పార్టీ ప్రస్తుతం గెలిచే పరిస్థితి లేదన్నారు. గత కొంత కాలం నుంచీ తెలంగాణ పేరుతో రాజకీయం చేస్తూ వచ్చిన కేసీఆర్ కు ప్రజల నాడి తెలియక తికమక పడుతున్నాడని , వచ్చే ఎన్నికలు కీలకంగా మారనున్నాయని స్పష్టం చేశారు . భారతీయ జనతా పార్టీ కూడా ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదన్నారు.
ఆయన ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా ముందే జోష్యం చెప్పారు. అటు కాంగ్రెస్ కు కానీ ఇటు బీజేపీకి కానీ లేదా బీఆర్ఎస్ కు కానీ 60 సీట్లకు మించి రావన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గాడిలో పడుతుందన్నారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ రెండూ బాగా డబ్బులు ఉన్న పార్టీలు అని ఎద్దేవా చేశారు. వాటితో పోటీ పడాలంటే తాము యుద్దం చేయాలన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy Telangana).
Also Read : ఆదివాసీలకు కేసీఆర్ సారీ చెప్పాలి