Piyush Goyal : ధాన్యం కొనుగోలుపై రాజకీయం తగదు
టీఆర్ఎస్ సర్కార్ పై పీయూష్ గోయల్
Piyush Goyal : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత లేకుండా పోయిందన్నారు.
ప్రధానంగా రాజకీయం చేయడం తప్పా రైతులకు మేలు చేయాలన్న సంకల్పం లేదన్నారు. ఎంత సేపు కేంద్రాన్ని బూచిగా చూపించడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు.
ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. కేవలం రాజకీయ ఎజెండాతోనే కేంద్ర సర్కార్ పై నిందలు వేస్తోందని దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ కు రాజకీయం చేయడం తప్పా మరో పని లేదన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన సీఎంతో మంత్రులతో పాటు ప్రజా ప్రతినిధులు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పీయూష్ గోయల్(Piyush Goyal) .
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దూషించడం వాళ్ల సంస్కారానికి నిదర్శనమని పేర్కొన్నారు. యావత్ ప్రపంచం పీఎంను గొప్ప లీడర్ గా గుర్తిస్తోందని కానీ సీఎం కేసీఆర్ కు అది కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
తమకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. తెలంగాణ సర్కార్ నిర్వాకం కారణంగానే పేదలకు బియ్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని మిల్లుల్లో నిల్వ ఉంచేందుకు తగిన సౌకర్యాలు లేవని మండిపడ్డారు. చాలా మిల్లుల్లో అక్రమాలు జరిగాయని అందుకే తాము చర్యలు తీసుకునే సరికల్లా తెలంగాణ సర్కార్ కు మింగుడు పడడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read : రాసే స్వేచ్ఛను అడ్డుకోలేం – చంద్రచూడ్